
9999నెం.కు రూ.5.54 లక్షలు
హైదరాబాద్: ఫ్యాన్సీ నంబర్ల క్రేజ్ రవాణాశాఖకు కాసుల పంట పండిస్తోంది. బుధవారం మేడ్చల్ ప్రాంతీయ రవాణా కార్యాలయంలో నూతన సిరీస్ ఏపీ 28 డీవై ప్రారంభం కావడంతో 9999 నంబరును దక్కించుకునేందుకు పలువురు వేలంలో పాల్గొన్నారు.
ఇందులో మెగా ఇంజినీరింగ్ కంపెనీ తమ సంస్థకు చెందిన బెంట్లీ కారుకు రూ.5,54,550 చెల్లించి ఈ ఫ్యాన్సీ నంబరును దక్కించుకుందని ఆర్టీఓ శంకర్ తెలిపారు. గతంలో నూజివీడు ఎంవీఐ కార్యాలయంలో ఏపీ సీజీ శ్రేణిలో 6666 నంబరు రూ.1,21,300 పలికింది.