జైపూర్ : ఎంతగానో ఇష్టపడి కొనుక్కునే వాహనాలకు ఫ్యాన్సీ నంబర్ కావాలని కోరుకునేవారు అందుకోసం భారీమొత్తం చెల్లించడానికి కూడా వెనుకాడటం లేదు. జైపూర్‌కు చెందిన వ్యాపారవేత్త రాహుల్ తనేజా మాత్రం తన కొత్త కారు నంబరు కోసం ఏకంగా రూ.16 లక్షలు వెచ్చించారు. గతంలో ఫ్యాన్సీ నంబర్ల కోసం భారీగానే ఖర్చు చేశారు రాహుల్. 2011లో తాను మొదట కొనుగోలు చేసిన బీఎండబ్ల్యూ 5 సిరీస్‌కు ‘నంబర్ 1’ కోసం రూ.10.31 లక్షలు చెల్లించి.. ఆర్‌జే 14 సీపీ 0001 పొందారు. ఆ తర్వాత స్కోడా, బీఎండబ్ల్యూ 7 సిరీస్‌లకు కూడా భారీగా వెచ్చించి 0001 నంబరు దక్కించుకున్నారు.
తాజాగా మార్చి 25న రూ.1.5 కోట్లతో జాగ్వార్ కారును కొనుగోలు చేశారు. దీనికి కూడా అదే ఫ్యాన్సీ నంబరు పొందడానికి దాదాపు 45 రోజులు ఎదురుచూశారు. చివరికి రూ. 16 లక్షలు చెల్లించి ఆర్‌జే 45 సీజీ 0001 నంబరును సొంతం చేసుకున్నారు. ఒక వాహనం నంబరు కోసం చెల్లించిన భారీ మొత్తం ఇదేనని జైపూర్ రవాణా శాఖ అధికారులు పేర్కొన్నారు. కాగా రాహుల్ తనేజా మొబైల్ నంబర్‌లో కూడా ఐదు ఒకట్లు ఉంటాయని తెలుస్తోంది. దీనిపై ఆయన స్పందిస్తూ.. తనకు ‘నంబరు 1’ బాగా కలిసొచ్చిందని తెలిపారు. అందుకు తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment