
ఇండోర్: గుడి ఆవరణలో కేవలం పూలు, పూజా సామగ్రి, ప్రసాదాలు విక్రయించే 69.50 చదరపు అడుగుల వైశాల్యమున్న చిన్నపాటి దుకాణాన్ని ఓ వ్యాపారి రూ.1.72 కోట్లకు 30 ఏళ్లపాటు లీజుకు దక్కించుకున్నాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లోని ప్రఖ్యాత ఖజ్రానా గణేశ్ ఆలయ కాంప్లెక్స్‌లో ఈ లీజు వ్యవహారం చోటుచేసుకుంది. ‘1–ఎ’ దుకాణాన్ని లీజుకు ఇవ్వడానికి ఆలయ అధికారులు టెండర్లు ఆహ్వానించారు. రూ.30 లక్షలు కనీస మొత్తంగా నిర్ణయించారు.
వేలం పాటలో ఇది ఏకంగా రూ.1.72 కోట్లకు చేరింది. అంటే ఒక్కో చదరపు అడుగు స్థలం రూ.2.47 లక్షలు పలికింది. వాణిజ్య స్థలం లీజు కోసం ఈ స్థాయిలో ధర పలకడం అరుదైన సంఘటన అని చెప్పొచ్చు. ఖాజ్రానా వినాయక ఆలయానికి దర్శించుకొనేందుకు ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు భారీగా తరలివస్తుంటారు. ఇక్కడ వ్యాపారం భారీగానే జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment