Indore Woman Beaten Up After Fight Over Parking With Doctor - Sakshi
Sakshi News home page

కూరగాయలు అమ్ముకునే మహిళపై డాక్టర్‌ దాడి!

Published Sun, Jan 16 2022 11:54 AM | Last Updated on Sun, Jan 16 2022 3:13 PM

Indore Woman Beaten Up After Fight Over Parking With Doctor - Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో తోపుడు బండిపై కూరగాయలమ్ముకునే ఒక మహిళపై నలుగురు వ్యక్తులు విచక్షణా రహితంగా దాడికి దిగారు.  గురువారం సాయంత్రం భన్వర్కువాన్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఓ మహిళ తోపుడు బండిపై కూరగాయలు అమ్ముకుంటున్న సమయంలో అక్కడే పార్క్ చేసిన కారు యజమాని అయిన డాక్టర్‌కు ఆమెకు పార్కింగ్ విషయంలో వాగ్వాదం జరిగింది. 

కాసేపటికి ఆ డాక్టర్ తన క్లినిక్ నుంచి తన సిబ్బందిని పిలిపించి ఆమెపై దాడి చేశాడు. కూరగాయలు అమ్మే ద్వారకా బాయిని , ఆమె కుమారుడు రాజును కొట్టించాడు. ఆమె బంగాళదుంపల్ని ఉల్లిపాయల్ని గిరాటేస్తూ సదరు మహిళపై దారుణంగా దాడికి దిగారు. తోపుడు బండి ముందు పార్క్ చేసిన కారును తరలించమని డాక్టర్‌ని కోరినందుకే వారు దాడికి దిగారని స్థానికంగా ఉన్నవారు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇది ఒక డాక్టర్‌ స్థాయి వ్యక్తి చేయాల్సిన పని కాదంటూ మండిపడుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement