ఇండోర్: చిన్నప్పుడు ఏదైనా తప్పు చేస్తే స్కూళ్లో టీచర్లు గుంజీలు తీయించేవారు. కానీ మనిషి పెరిగినా బుద్ధి పెరగకపోతే ఇదిగో పై ఫొటోలో కనిపిస్తున్నట్లు పోలీసులు బజారులోనే గుంజీలు తీయిస్తారు. ఈ అరుదైన శిక్ష విధించిన ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది. ఆగస్టు 11న ఇండోర్‌లో ఇద్దరు దుండగులు ఓ వ్యక్తి వాహనాన్ని అప్పగించమని దబాయించారు. అతడు కుదరదని చెప్పడంతో కత్తితో దాడి చేసి అక్కడ నుంచి పరారయ్యారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ద్వారకాపురి ప్రాంతంలో తిరుగాడుతున్న ఆ ఇద్దరు దుండగులను గురువారం అరెస్ట్ చేశారు. వీరిద్దరినీ అజయ్ ఠాకూర్, విజయ్ విశ్వకర్మలుగా గుర్తించారు. (కొడుకుతో సైకిల్‌పై 105 కి.మీ ప్రయాణం.. ఎందుకంటే)
అనంతరం రోడ్డు మీదనే వీరికి బుద్ధొచ్చేలా చేయాలని పోలీసులు భావించారు. దీంతో నడిరోడ్డుపైనే చెవులు పట్టుకుని గుంజీలు తీయించారు. ప్రజలకు క్షమాపణలు చెప్పించారు. ఆ తర్వాత వాళ్లు కత్తి దూసిన చోటే ముక్కు నేలకు రాశేలా చేశారు. దీన్ని అక్కడున్న కాలనీ వాసులు ఇళ్లలో నుంచి చూస్తూ పోలీసుల చర్యను అభినందిస్తూ చప్పట్లు కొట్టారు. 'నిందితులతో ఇలా చేయించడం వల్ల ప్రజలకు నేరస్థులంటే భయం పోయే అవకాశం ఉంటుంది, అలాగే ఏదైనా నేరం జరిగినప్పుడు పోలీసులను సంప్రదించడానికి ప్రజలకు వెనుకాడరు' అని ద్వారకాపురి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో ధరంవీర్ సింగ్ తెలిపారు. నిందితులు గుంజీలు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (‘ముఖానికి మాస్కు లేదా.. అయితే ఈ యంత్రం పెట్టేస్తుంది’)
#WATCH Madhya Pradesh: Police in Indore's Dwarkapuri made two criminals do sit-ups and apologise to people for their crimes. (20/08/20) pic.twitter.com/j1zBBSKgff
— ANI (@ANI) August 21, 2020
Comments
Please login to add a commentAdd a comment