ఇండోర్: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇండోర్‌లో ఓ రెండంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు మరణించినట్లు ఇండోర్ కమిషనర్ హరినారాయణ చారి మిశ్రా తెలిపారు.
తొమ్మిది మంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా.. వీళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. శనివారం వేకువ జామున నాలుగు, ఐదు గంటల మధ్య ఇండోర్ స్వర్ణ్ భాగ్ కాలనీలోని ఓ రెండు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. నిద్రలో ఉండగా జరిగిన ప్రమాదంతో తప్పించుకునేందుకు వీలు లేకుండా పోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మూడుగంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే షార్ట్‌సర్క్యూట్‌తోనే ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.
#UPDATE | Seven people died in the fire that broke out in a two-storey building in Indore, Madhya Pradesh: Indore Police Commissioner Harinarayana Chari Mishra to ANI
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) May 7, 2022
Latest visuals from the spot. pic.twitter.com/E6wXhytkl3
Comments
Please login to add a commentAdd a comment