ఘోర అగ్ని ప్రమాదం; మంటల్లో పవర్‌హౌజ్‌ | Fire Broke Out At Indore Powerhouse | Sakshi
Sakshi News home page

పవర్‌హౌజ్‌లో పేలిన ట్రాన్స్‌ఫార్మర్‌

Published Fri, May 31 2019 8:26 AM | Last Updated on Fri, May 31 2019 8:29 AM

Fire Broke Out At Indore Powerhouse - Sakshi

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇండోర్‌ ప్రధాన పవర్‌​హౌజ్‌లోని ట్రాన్స్‌ఫార్మర్‌ పేలిపోవడంతో ప్రమాదం సంభవించింది. దీంతో పవర్‌ ప్లాంట్‌ మొత్తం మంటలు అంటుకున్నాయి. ఈ క్రమంలో అగ్నిమాపక దళాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. గురువారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన కారణంగా కరెంటు లేక ఇండోర్‌ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ప్రమాదానికి సంబంధించిన కారణాలు మాత్రం ఇంతవరకు తెలియరాలేదు.

కాగా ఈ వారంలో ఇండోర్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం ఇది రెండోసారి. సోమవారం రాత్రి గురునానక్‌ టింబర్‌ మార్కెట్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో రెండు గోదాములు, రెండు షాపులు దగ్ధమయ్యాయి. అయితే ఈ ప్రమాదాలు రాత్రి సమయంలో జరగడంతో అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం సంభవించలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement