
ప్రతీకాత్మక చిత్రం
ఇండోర్: లింగమార్పిడి చేసుకుని మహిళగా మారిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. పాలక్(26) అనే వ్యక్తి ఎనిమిదేళ్ల క్రితం లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకున్నాడు. మహిళగా మారి ఓ యువకుడిని వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల తర్వాత ఆపరేషన్ వికటించడంతో పాలక్‌కు శారీరక సమస్యలు తలెత్తాయి. దీంతో ఆమె మానసిక ఆందోళనకు గరైంది. ఈ నేపథ్యంలో ఉరివేసుకుని బలవనర్మణానికి పాల్పడింది.
ఈ విషయం గురించి పోలీసులు మాట్లాడుతూ.. డిప్రెషన్‌తోనే బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నామన్నారు. అయితే ఇంతవరకు సూసైడ్ నోట్ లభించలేదని.. ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం పంపామని తెలిపారు. రిపోర్ట్ రాగానే ఆత్మహత్యకు గల కారణాలపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment