దేశంలో అతిపెద్ద షాపింగ్ మాల్ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో అందుబాటులోకి వచ్చింది. షాపింగ్ మాల్స్ అభివృద్ధి, నిర్వహణలో ఉన్న ఫీనిక్స్ మిల్స్ దీనిని ఏర్పాటు చేసింది. 19 ఎకరాల్లో ఫీనిక్స్ సిటాడెల్ మాల్ కొలువుదీరింది. ఈ ప్రాజెక్టుకు కంపెనీ రూ.800 కోట్లు ఖర్చు చేసింది.
కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డ్ జేవీ ద్వారా ఫినిక్స్ మిల్స్ ఈ మాల్‌ను అభివృద్ధి చేసింది. మాల్‌లోని ప్రధాన భవనం 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. 300 షాప్స్ ఏర్పాటయ్యాయి. వచ్చే ఏడాది ఈ దుకాణాలు రూ.1,000 కోట్ల వ్యాపారం చేసే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment