
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మీద తమ గౌరవాన్ని భిన్నంగా చాటుకున్నది ‘షికుంజ్.కామ్’ అనే సంస్థ. 4 వేల చదరపు అడుగుల ముర్ము కలప పోట్రెయిట్‌ను గీయించింది. అది కూడా వెస్టీజ్ వుడ్ (వివిధ రకాల కర్ర ముక్కలనుంచి తయారు చేసిన కలప)తో తయారు చేసిన కాన్వాస్ మీద. ఇండోర్‌కు చెందిన ప్రముఖ ఆర్టిస్ట్ సాహిల్ లహరి, మరో 50 మంది కళాకారులు కలిసి ఈ పోట్రెయిట్‌ను రూపొందించారు.
ఈ కళాఖండాన్ని తయారు చేయడానికి వారికి ఐదు రోజులు పట్టింది. ‘‘రాజ్యాంగపరంగా ఈ దేశపు అత్యున్నత పదవి రాష్ట్రపతి. ఆ స్థానానికి ఎన్నిౖకైన మొట్టమొదటి గిరిజన మహిళ ద్రౌపదీ ముర్ము. మహిళా సాధికారతకోసం పనిచేసే మా సంస్థ మహిళ అయిన రాష్ట్రపతికి ఇచ్చే గౌరవం ఇది’’ అని నిర్వాహకుల్లో ఒకరైన రాహుల్ భార్గవ్ తెలిపారు.
చదవండి: మెట్రో స్టేషన్‌పై వ్యక్తి హల్‌చల్.. పోయే కాలం అంటే ఇదేనేమో భయ్యా!