potrait
-
Photo Feature: కలపపై రాష్ట్రపతి పోట్రెయిట్
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మీద తమ గౌరవాన్ని భిన్నంగా చాటుకున్నది ‘షికుంజ్.కామ్’ అనే సంస్థ. 4 వేల చదరపు అడుగుల ముర్ము కలప పోట్రెయిట్‌ను గీయించింది. అది కూడా వెస్టీజ్ వుడ్ (వివిధ రకాల కర్ర ముక్కలనుంచి తయారు చేసిన కలప)తో తయారు చేసిన కాన్వాస్ మీద. ఇండోర్‌కు చెందిన ప్రముఖ ఆర్టిస్ట్ సాహిల్ లహరి, మరో 50 మంది కళాకారులు కలిసి ఈ పోట్రెయిట్‌ను రూపొందించారు. ఈ కళాఖండాన్ని తయారు చేయడానికి వారికి ఐదు రోజులు పట్టింది. ‘‘రాజ్యాంగపరంగా ఈ దేశపు అత్యున్నత పదవి రాష్ట్రపతి. ఆ స్థానానికి ఎన్నిౖకైన మొట్టమొదటి గిరిజన మహిళ ద్రౌపదీ ముర్ము. మహిళా సాధికారతకోసం పనిచేసే మా సంస్థ మహిళ అయిన రాష్ట్రపతికి ఇచ్చే గౌరవం ఇది’’ అని నిర్వాహకుల్లో ఒకరైన రాహుల్ భార్గవ్ తెలిపారు. చదవండి: మెట్రో స్టేషన్‌పై వ్యక్తి హల్చల్.. పోయే కాలం అంటే ఇదేనేమో భయ్యా! -
కారులో వెళ్తున్న ప్రధాని మోదీ.. యువతి చేతిలో ఆ ఫోటో చూడగానే..
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఓ యువతి తన కళతో ఆకట్టుకుంది. ఎంతలా ఆంటే ఏకంగా ఆ యువతి కోసం ప్రోటోకాల్‌ని పక్కనబెట్టి తన దగ్గరకు వెళ్లి కాసేపు సంభాషించారు. వివరాల్లోకి వెళితే.. సిమ్లాలోని రిడ్జ్ మైదాన్‌కు వెళ్లే రహదారిలో ప్రధాని మోదీని చూసేందుకు వేచి ఉన్న ప్రేక్షకులతో నిండిపోయింది. గుమిగూడిన ఆ జనం మధ్య, అను అనే అమ్మాయి ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ మోదీ చిత్రపటాన్ని పట్టుకుని నిలబడి ఉంది. ఈ విషయాన్ని గుర్తించిన ప్రధాని తన కారును ఆపి, హై సెక్యూరిటీ ప్రోటోకాల్‌ను పక్కనబెట్టి ఆమె దగ్గరకు వెళ్లి ఆ ఫోటోను స్వీకరించారు. అనంతరం.. "నీ పేరు ఏమిటి? ఎక్కడ నివసిస్తున్నారు? ఈ పెయింటింగ్ గీయడానికి ఎన్ని రోజులు పట్టింది? అని యువతిని ప్రశ్నించారు. అందుకు బదులుగా ఆ యువతి.. తాను సిమ్లావాసినని, తానే స్వయంగా ఒక్కరోజులో ఈ చిత్రపటాన్ని పూర్తి చేసినట్లు ప్రధానికి తెలిపింది. యువతి పెన్సిల్ ఆర్ట్‌ను మోదీ అభినందించారు. 'గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్'లో పాల్గొనేందుకు ప్రధాని మంగళవారం సిమ్లా చేరుకున్నారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 10 కోట్ల మందికి పైగా లబ్ధిదారులకు ప్రధాన మంత్రి ₹ 21,000 కోట్లు విడుదల చేశారు. చదవండి: భారతి ‘స్వరాజ్’’పై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు -
ట్రంప్, పుతిన్‌ల బ్రొమాన్స్!
విల్నీయస్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్ష పదవికి రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌లకు సంబంధించిన ఓ పేయింటింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇరువురు ప్రముఖ నేతల గాఢ చుంబనాన్ని చూపిస్తున్న ఈ గ్రాఫిటీ పెయింటింగ్‌ను లిథువేనియా వీధుల్లో స్థానిక కళాకారుడు మిండాగస్ బొనాను వేసాడు. బార్బెక్యూ రెస్టారెంట్ సహ యజమాని డొమినికాస్తో కలిసి ఇటీవల ఆవిష్కరించిన ఈ పెయింటింగ్ ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. తూర్పు జర్మనీ కమ్యూనిస్టు నాయకుడు ఎరిక్ హోనెక్కర్, సోవియట్ లీడర్ లియోనార్డ్ బ్రెజ్నెవ్కు సంబంధించిన ఓ ఫోటో గ్రాఫ్ ఆధారంగా.. 1990లో బెర్లిన్ గోడపై గ్రాఫిటీ కళాకారుడు దిమిత్రీ రూబెల్ వేసిన పెయింటింగ్‌తో ఈ చిత్రానికి పోలికలున్నాయి. అయితే 'మేక్ ఎవ్రిథింగ్ గ్రేట్ ఎగైన్' అంటూ క్యాప్షన్‌ను కూడా జోడించిన పుతిన్, ట్రంప్ ల చిత్రంపై నెటీజనులు పలురకాలుగా స్పందిస్తున్నారు. గతంలో పలు సందర్భాల్లో ట్రంప్, పుతిన్ ఒకరినొకరు అభినందించుకున్న విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. దీనిపై డొమినికస్ మీడియాతో మాట్లాడుతూ.. ఇద్దరు నేతల మధ్య సారూప్యతల ఫలితంగా వచ్చిన ఆలోచన ఇదని తెలిపాడు.