సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ సెమీఫైనల్లో మధ్యప్రదేశ్ ఆటగాడు, టీమిండియా ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ బంతితో రాణించాడు. ఢిల్లీతో ఇవాళ (డిసెంబర్ 13) జరిగిన మ్యాచ్‌లో అయ్యర్ రెండు ఓవర్లలో కేవలం 12 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.
అయ్యర్‌తో పాటు కుమార్ కార్తికేయ (3-0-23-1), ఆవేశ్ ఖాన్ (4-0-36-1), త్రిపురేశ్ సింగ్ (3-0-18-1) వికెట్లు తీయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు మాత్రమే చేసింది.
అనుజ్ రావత్ (33 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలువగా.. ప్రియాన్ష్ ఆర్య 29, యశ్ ధుల్ 11, ఆయుశ్ బదోని 19, హిమ్మత్ సింగ్ 15, మయాంక్ రావత్ 24, హర్ష్ త్యాగి 9 (నాటౌట్) పరుగులు చేశారు.
ఇదిలా ఉంటే, ఇవాళే జరిగిన తొలి సెమీఫైనల్లో బరోడాపై ముంబై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బరోడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. శాశ్వత్ రావత్ (33), కృనాల్ పాండ్యా (30), శివాలిక్ శర్మ (26 నాటౌట్), అథీత్ సేథ్ (22) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. హార్దిక్ పాండ్యా 5 పరుగులకే ఔటై నిరాశపరిచాడు.
159 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. రహానే (56 బంతుల్లో 98; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) రఫ్ఫాడించడంతో 17.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. రహానేకు జతగా శ్రేయస్ అయ్యర్ (46) కూడా కాసేపు మెరుపులు మెరిపించాడు.
భీకర ఫామ్‌లో రహానే
ముంబై వెటరన్ అజింక్య రహానే సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. బరోడాతో జరిగిన మ్యాచ్‌లో రెండు పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్న రహానే.. ఈ టోర్నీలో గత ఆరు మ్యాచ్‌ల్లో ఐదు హాఫ్ సెంచరీలు చేశాడు.
గత ఆరు మ్యాచ్‌ల్లో రహానే చేసిన స్కోర్లు..
- 52(34) vs మహారాష్ట్రపై
- 68(35) vs కేరళపై
- 22(18) vs సర్వీసెస్‌పై
- 95(53) vs ఆంధ్రపై
- 84(45) vs క్వార్టర్ ఫైనల్లో విదర్భపై
- 98(57) vs సెమీస్‌లో బరోడాపై
Comments
Please login to add a commentAdd a comment