
సాక్షి, వీరవాసం: పశ్చిమగోదావరి జిల్లా వీరవాసం ఏఎస్‌ఐ హత్యాయత్నం జరిగింది. ఏఎస్‌ఐ పార్థ సారథిపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. రక్తపుమడుగులో పడి వున్న సారధిని కొందరు స్థానికులు గుర్తించి చికిత్స నిమిత్తం భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దాడికి కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
హత్యాయత్నంపై స్పందించిన డీజీపీ
దాడి ఘటనపై డీజీపీ గౌతం సవాంగ్ స్పందించారు. ఏఎస్‌ఐకి మెరుగైన వైద్యం అందించాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు. ఘటనతో సంబంధం ఉన్న వారందరినీ తక్షణమే అరెస్ట్ చేయాలని ఆదేశించారు. సంఘటనా స్థలానికి వెళ్లి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి నివేదిక అందించాల్సిందిగా జిల్లా ఎస్పీని డీజీపీ ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment