మహిళపై హత్యాయత్నం | Women assassination attempt | Sakshi
Sakshi News home page

మహిళపై హత్యాయత్నం

Published Thu, Nov 27 2014 2:14 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

మహిళపై హత్యాయత్నం - Sakshi

మహిళపై హత్యాయత్నం

 శ్రీకాకుళం క్రైం: దుకాణంలో ఉన్న ఒంటరిగా ఉన్న మహిళపై గుర్తు తెలియని వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆ మహిళ తిరగబడడంతో తీవ్రంగా గాయపరచి పరారయ్యాడు. పట్టణంలో బుధవా రం ఉదయం ఈ సంఘటన కలకలం రేపింది. చినబజారు పెట్రోల్ బంక్ సమీపంలో గుడ్ల ధర్మరాజు కు పరుపులు, ఫర్నీచర్ విక్రయించే దుకాణం ఉం ది. ధర్మరాజు వేరే పని మీదగా వెళ్లగా ఆయన భార్య రమాదేవి (45) దుకాణాన్ని 10.30 గంట లకు తెరచింది. గురువారం నుంచి మార్గశిరమాస పూజలుండడంతో పట్లు దులిపేందుకు సిద్ధమైంది. ఇదే సమయంలో గుర్తుతెలియని వ్యక్తి దుకాణంలో కి వచ్చి పరుపు కావాలని అడిగాడు. చూపిస్తానని వెనకే ఉన్న మరో గదిలోకి రమాదేవి తీసుకువెళ్లగా ఆ వ్యక్తి హవభావాలు చూసి ఆమెకు అనుమానం కలిగింది.
 
 తన ఒంటిపై ఉన్న బంగారం కోసం ప్రయత్నిస్తున్నట్టు అనుమానం రావడంతో ఎవరు నువ్వు, ఏం కావాలని ప్రశ్నించింది. దీంతో ఆ వ్యక్తి తనతో తెచ్చుకున్న బ్యాగులోని బలమైన ఆయుధంతో ఆమె తలపై మోదబోయాడు. ఆమె ప్రతిఘటించడంతో ముక్కు, ముఖంపై గాయపరిచాడు. అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న రాళ్లపైకి ఆమె ను తోసేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంట నే ఆమె కేకలు వేయడంతో అతడు పరారు అయ్యా డు. ఒంటిపై బంగారం నగలు కాజేసేందుకే అతగాడు వచ్చినట్టు బాధితురాలు, ఆమె భర్త చెబుతున్నారు. చికిత్స కోసం ఆమెను రిమ్స్‌కు తరలించారు. ఆమె భర్త ధర్మరాజు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా డీఎస్పీ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. హత్యాయత్నం బంగారం కోసమేనా..మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement