బెళ్లారె ఎస్‌ఐ ఎంవీ చెలువయ్యపై దుండగులు హత్యాయత్నానికి పాల్పడ్డారు.
బెంగళూరు(మంగళూరు): ఉర్వా పోలీస్ స్టేషన్ ఏఎస్‌ఐ ఐతప్పపై జరగిన హత్యాయత్నం ఘటన మరువకముందే మరో పోలీసు అధికారిపై దుండగులు హత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన శనివారం దక్షణ కన్నడ జిల్లాలోని బెళ్లారెలో జరిగింది. వివరాలు....గోవుల అక్రమ రవాణను అడ్డుకోవడానికి బెళ్లారె ఎస్‌ఐ ఎంవీ చెలువయ్య తన బృందంతో కలసి శనివారం బెళ్లారె స్టేషన్ పరిధిలోని కాణియూరులో వాహనాల తనిఖీ చేస్తున్నారు.
ఈ సమయంలో రజాక్ అనే యవకుడు జీవాలతో పికప్‌వ్యాన్‌లో అక్కడికి చేరుకోవడాన్ని గమనించిన ఎస్‌ఐ చెలువయ్య వ్యాన్‌ను నిలిపాలంటూ సూచించాడు. అయితే రజాక్ వ్యాన్‌ను నిలపకుండా ఎస్‌ఐ చెలువయ్యపై ఎక్కించడానికి ప్రయత్నించాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఎస్‌ఐ చెలువయ్య పక్కకు తప్పుకున్నాడు.మిగిలిన పోలీసులు రజాక్‌ను అరెస్ట్ చేసి పికప్‌వ్యానులో నున్న రెండు గొర్రెలు,13 గేదెలు, మేకలను స్వాధీనం చేసుకున్నారు.