
సాక్షి, విశాఖపట్నం: తనను అరెస్ట్ చేయాలని లోకేష్ పదేపదే చెప్పనక్కర్లేదని.. నేరం రుజువైతే అరెస్ట్ తప్పదని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు కోసం చట్టాలు, జైలు రూపొందించలేదన్నారు. జైళ్లలో అన్ని రకాల నేరస్తులు ఉంటారు. రాజమండ్రి జైలుల్లో చంద్రబాబుకు పూర్తి భద్రత కల్పించాం.. ఆయనకు ఇంటి భోజనం కూడా అందిస్తున్నారు. మావోయిస్టుల నుంచి జైలులో చంద్రబాబుకు ఏ ఇబ్బంది లేదు.. ఆయన భద్రత ప్రభుత్వం బాధ్యత. లోకేష్, పవన్, బాలకృష్ణ వారి పని వారు చేసుకోవచ్చు’ అని తానేటి వనిత అన్నారు.
‘‘రోడ్డెక్కి ప్రజలను రెచ్చగొడితే చర్యలు తప్పవు. చంద్రబాబు ఉన్న గది పరిసరాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. చంద్రబాబు అనుమతితోనే ఎవరినైనా ఆయన వద్దకు పంపించడం జరుగుతుంది. చంద్రబాబు సామాన్య వ్యక్తి కాదు... 14 ఏళ్ల సీఎం.. సాక్ష్యాలు లేకుండా అతన్ని సీఐడీ అరెస్టు చేయదు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న సాక్ష్యాలు ఉండబట్టే ఆయన్ను సీఐడీ అరెస్టు చేసింది’’ అని హోంమంతి పేర్కొన్నారు.
‘‘జైళ్ళలో ఉద్యోగుల కేడర్ బట్టి విధులు కేటాయించడం జరుగుతుంది.. అంతేగాని బంధుత్వం బట్టి జరగదు.. నంద్యాల నుంచి సుఖంగా చాపర్‌లో తీసుకువెళ్తామని సీఐడీ చెప్తే వినకుండా రోడ్డు మార్గంలో ప్రజల్ని రెచ్చగొట్టేందుకు చంద్రబాబు వచ్చారు. టీడీపీ నాయకులు కావాలనే అల్లర్లు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు. లోకేష్, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ చెప్పే మాటల్లో స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ప్రమేయం లేదని ఉందా?. పోలీసులు సంయమనంతో ఉండడంవల్ల ఏపీలో శాంతియుతంగా ఉంది. స్కిల్ కుంభకోణంలో కేవలం చంద్రబాబు నాయుడు రిమాండ్‌కి తీసుకున్నారు. విచారణకు చంద్రబాబు సహకరిస్తే అసలు విషయాలు బయట పడతాయి’’ అని హోంమంత్రి తానేటి వనిత అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment