ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తల అక్రమ నిర్బంధం
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లాలో రెడ్‌బుక్ పోలీసింగ్ నడుస్తోంది. అక్రమ కేసులు, నిర్బంధాలతో ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు టార్గెట్‌గా వేధింపులకు పాల్పడుతున్నారు. కేసు పెట్టకుండా.. నోటీసు ఇవ్వకుండా స్టేషన్‌లో కూర్చోబెట్టి వేధిస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తే.. ఎమ్మెల్యేల ఒత్తిడితో తప్పడం లేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అర్ధరాత్రి ఎత్తుకెళ్లి...
శనివారం అరర్ధరాత్రి 12 గంటల సమయంలో రెంటచింతల మాజీ జెడ్పీటీసీ, వైఎస్సార్‌సీపీ నేత నవులూరి భాస్కర్‌రెడ్డి ఇంటికి రెంటచింతల ఎస్‌ఐ సీహెచ్ నాగార్జున తన సిబ్బందితో వచ్చి తీసుకెళ్లారు. ఎందుకు తీసుకెళ్తున్నారు? ఎక్కడి తీసుకెళ్తున్నారు? అనే ప్రశ్నలకు ఎస్‌ఐ సమాధానం ఇవ్వలేదు.
పిడుగురాళ్ల వరకు తీసుకువెళ్లి తెల్లవారుజామున 4 గంటల సమయంలో తిరిగి రెంటచింతలలో వదిలివెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు పరోక్షంగా భాస్కర్‌రెడ్డికి చెప్పిందేమంటే... ‘నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలంతా ఊర్లు వదలి వెళ్లిపోయారు. మీరు వెళ్లలేదని మాకు పైనుంచి ఒత్తిడి ఉంది. మీరు కూడా ఇక్కడి నుంచి వెళ్లిపోతే మంచిది’ అని హెచ్చరించారు.
అధికారపార్టీ నేతలపై చర్యలేవీ?
వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు తప్పు చేయకపోయినా వేధిస్తున్న పోలీసులు... కూటమి పార్టీ నేతలు రోజూ దౌర్జన్యాలకు, దాడులకు తెగబడుతున్నా అడ్డుకోవడం లేదు. నరసరావుపేట, చిలకలూరిపేటలలో వ్యాపారులపై దాడులకు దిగినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.
వైఎస్సార్‌సీపీ మహిళా నాయకురాలు పాలేటి కృష్ణవేణిని శనివారం అరెస్ట్ చేసి చిలకలూరిపేట పోలీస్‌స్టేషన్‌లో ఉంచిన సమయంలో తెలుగు మహిళలు నానా హంగామా సృష్టించారు. కృష్ణవేణిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. అడ్డుకున్న పోలీసులను నడిరోడ్డుపై తీవ్రంగా దుర్భాషలాడినా పల్నాడు పోలీసులు పట్టించుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment