క్యూలో ఏం జరిగింది?
పెద్దనోట్ల రద్దు వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారనే కథతో తీసిన చిత్రం ‘ఏటీఎం వర్కింగ్’. పవన్, కారుణ్య, రాకేశ్, మహేంద్ర, నారాయణ, ఆషా, మహేశ్ ముఖ్య తారలుగా పి. సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకత్వంలో కిశోరి బసిరెడ్డి, యక్కలి రవీంద్రబాబు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదలవుతోంది. దర్శకుడు మాట్లాడుతూ – ‘‘125 కోట్లమంది భారతీయులపై ప్రభావం చూపిన ఓ నిర్ణయంపై సరదాగా సినిమా చేశాం.
‘ఏటీఎం నాట్ వర్కింగ్’ అని టైటిల్ పెడితే.. సెన్సార్ సభ్యులు ‘నాట్’ అనే పదాన్ని తొలగించారు. ప్రజలకు నిజాలేంటో తెలుసు. రాజకీయ నేపథ్యంలో కాకుండా బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న లోటుపాట్లను చర్చిస్తూ వినోదాత్మకంగా ఈ సినిమా తీశాం. ఏటీఎం క్యూలో ఏం జరిగింది? అనేది కథ’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: కుర్రా విజయ్‌కుమార్, రాజ.సి, పీఎల్‌కే రెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బి. బాపిరాజు, సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి.