ఆటో కోసం ఎదురు చూస్తున్న చిన్నారిని మృత్యువు ట్రాక్టర్ రూపంలో కబళించింది.
ఆటో కోసం ఎదురు చూస్తున్న చిన్నారిని మృత్యువు ట్రాక్టర్ రూపంలో కబళించింది. ఈఘటన మునగ చర్ల సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. మునగచర్ల గ్రామానికి చెందిన సికుల్ల ఆకాశ్(4)కు గత రెండు రోజులుగా జ్వరంగా ఉండటంతో అతని తల్లి రాధా నందిగామలోని ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు ఆటో కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఎన్‌హెచ్ 65పై వేగంగా వస్తున్న ట్రాక్టరు వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడిక్కడే మృతి చెందగా అతని తల్లి గాయాలపాలయ్యింది.