వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఓ విద్యార్థి మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం గుత్యా గ్రామ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
హైదరాబాద్ కూకట్‌పల్లిలోని అభిలాష్ ఇంటర్ కళాశాలకు చెందిన 11 మంది విద్యార్థులు నల్లగొండ నుంచి గుత్యాకు కారులో వస్తుండగా.. గ్రామ శివారులో అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో కారులో ఉన్న రాకేష్(16) మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.