లాఠీచార్జిలో గాయపడిన విద్యార్థి పరిస్థితి విషమం | Student injured in the baton charge in serious condition | Sakshi
Sakshi News home page

లాఠీచార్జిలో గాయపడిన విద్యార్థి పరిస్థితి విషమం

Published Wed, Apr 20 2016 10:34 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

లాఠీచార్జిలో గాయపడిన విద్యార్థి పరిస్థితి విషమం - Sakshi

లాఠీచార్జిలో గాయపడిన విద్యార్థి పరిస్థితి విషమం

రాజేంద్రనగర్‌లోని అగ్రికల్చర్ వర్సిటీలో మంగళవారం పోలీసుల లాఠీదెబ్బలతో తీవ్రంగా గాయపడిన రాకేష్ ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉండటంతో కేర్ ఆసుపత్రికి తరలించారు. వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి రాక సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెల్సిందే.

 మంత్రిని విద్యార్థులు నిర్బంధించటంతో పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. జీవో నెంబర్ 45ను వెంటనే వెనక్కి తీసుకోవాలని, పశువైద్య అధికారుల పోస్టులను డిపార్టుమెంటల్ పరీక్షల ద్వారానే ఎంపిక చేయాలంటూ పశువైద్య విద్యార్థులు మంత్రిని సమావేశమందిరంలోనే నిర్బంధించారు. గాయపడిన విద్యార్థి రాకేష్ వెటర్నరీ విభాగంలో 4వ సంవత్సరం చదువుతున్నాడు. విద్యార్థి సొంత జిల్లా వరంగల్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement