Hospital care
-
మహాదాత చలమయ్య అస్తమయం
బీచ్‌రోడ్ (విశాఖ): పారిశ్రామికవేత్త, ప్రముఖ దాత మట్టపల్లి చలమయ్య (94) సోమవారం కన్నుమూశారు. ఆయనకు శనివారం రాత్రి గుండెపోటు రావడంతో హుటాహుటిన రామ్‌నగర్ కేర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందు తూ, సోమవారం తెల్లవారుజామున 1.40 గంటల సమయం లో మరణించారు. సోమవారం సాయంత్రం జరిగిన అంతిమ యాత్రలో అధిక సంఖ్యలో ప్రజలు, పలు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. కాన్వెంట్ జంక్షన్‌లోని హిందూ శ్మశానవాటికలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. 1923 నవంబర్ 19న తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో చలమయ్య జన్మించారు. ఎస్ఎస్ఎల్సీ వరకే చదువుకున్నా 17 ఏళ్ల ప్రాయంలోనే తండ్రికి అండగా వ్యాపార రంగంలోకి ప్రవేశించి ప్రముఖ పారిశ్రా మికవేత్తగా ఎదిగారు. 1941లో బర్మా నుంచి వలస వచ్చి, సామర్లకోట రైల్వేస్టేషన్‌కు చేరుకున్న శరణార్థులకు ప్రతిరోజు 5వేల మందికి అన్నం పెట్టి ఆకలి తీర్చారు. -
క్యాన్సర్‌ను నయం చేయడం సులువే
కేర్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ సోమరాజు సాక్షి, హైదరాబాద్: గుండె సంబంధిత వ్యాధులను నయం చేయడం కంటే కూడా క్యాన్సర్‌ను నయం చేయడం సులువని కేర్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ బి.సోమరాజు స్పష్టం చేశారు. తక్కువ కోతల శస్త్రచికిత్స, కీమోథెరపీ మందులు, రేడియో థెరపి వంటి అధునాతన చికిత్స ద్వారా క్యాన్సర్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చన్నారు. ‘లైఫ్ బియాండ్ ఫియర్’ నినాదంతో క్యాన్సర్‌పై కేర్ ఆసుపత్రి ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించింది. చికిత్స ద్వారా బతికి బయటపడిన రోగులతో ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో సోమరాజు మాట్లాడారు. వచ్చే పదీ పదిహేనేళ్లలో ప్రతీ ముగ్గురు పురుషుల్లో ఒకరికి, ఐదుగురు మహిళల్లో ఒకరికి క్యాన్సర్ సోకే ప్రమాదముందన్నారు. కన్సల్టెంట్ హెమటో ఆంకాలజిస్ట్, బోన్‌మారో ట్రాన్స్ఫ్లాంట్ ఫిజీషియన్ డాక్టర్ సొనాలి సదవర్తె మాట్లాడుతూ క్యాన్సర్ అంటే భయం అవసరం లేదని.. అనేకమంది చికిత్స చేయించుకొని సాధారణ జీవితం గడుపుతున్నారని అన్నారు. విలేకరుల సమావేశంలో కేర్ సీనియర్ మేనేజర్ ఎం.శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
అడ్డుకున్నందుకే అంతమొందించాలనుకున్నారు
- పహిల్వాన్ గ్యాంగ్ ప్రభుత్వ భూముల ఆక్రమణపై అధికారులకు ఫిర్యాదు చేశా - హత్యాయత్నానికి 17 రోజుల ముందే చంపుతామని బెదిరించారు - కోర్టులో వాంగ్మూలమిచ్చిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సాక్షి, హైదరాబాద్: తన నియోజకవర్గంలోని ప్రభుత్వ స్థలాలను పహిల్వాన్ గ్యాంగ్ ఆక్రమించిందని వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నించినందుకే తనను అంతమొందించాలని వారు ప్రయత్నించారనీ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తెలిపారు. తనపై జరిగిన హత్యాయత్నం కేసులో అక్బరుద్దీన్ బుధవారం రెండోసారి నాంపల్లి కోర్టుకు హాజరై వాంగ్మూలమిచ్చారు. ఆ వివరాలు ఇలా... 2009 ఎన్నికల్లో నా ప్రత్యర్థికి మద్దతిచ్చారు ‘2009 ఎన్నికల్లో మహ్మద్ పహిల్వాన్ నా ప్రత్యర్థి ఎంబీటీ పార్టీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు. అప్పటి నుంచే నామీద కక్ష పెంచుకొని చంపుతామని బెదిరించారు. పహిల్వాన్, మునావర్ ఇక్బాల్‌లు నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్నట్లుగా స్థానికులు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులకు వినతిపత్రం ఇచ్చాను. దీనిపై హైదరాబాద్ కలెక్టర్, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ స్పందించి ఆక్రమించిన స్థలాలను పరిశీలించి అక్కడ నిర్మాణాలు ప్రారంభమైనట్లు గుర్తించారు. 2011 ఏప్రిల్ 13న గుర్రంచెరువు కట్ట ప్రాంతంలో స్థానిక ఆర్ఐతో కలిసి అక్రమ నిర్మాణాలను పరిశీలించి వస్తుండగా యూనుస్ బిన్ ఓమర్ యాఫై ఆయన కుమారుడు ఈసా బిన్ యూనుస్ యాఫైలు నా వాహనాన్ని ఆపారు. నాతో వాగ్వాదానికి దిగి చంపుతామని బెదిరించారు. పహిల్వాన్ గ్యాంగ్ అక్రమాలను అడ్డుకుంటున్నాననే కక్షతోనే నన్ను చంపి అడ్డుతొలగించుకోవాలని భావించారు. ఇందులో భాగంగానే ఏప్రిల్ 30, 2011న కత్తులు, తుపాకులు, క్రికెట్ బ్యాట్‌తో నాపై దాడి చేశారు. ఈ దాడిలో అనేకచోట్ల కత్తులతో పొడిచారు. బుల్లెట్ గాయాలయ్యాయి’’ అని అక్బరుద్దీన్ వివరించారు. ఈ సందర్భంగా తనను చంపుతామని బెదిరించిన మునావర్ ఇక్బాల్, యూనుస్ బిన్ ఓమర్ యాఫైలను అక్బరుద్దీన్ గుర్తించారు. కేర్ ఆసుపత్రిలో 20 రోజులు చికిత్స పొందా ‘‘దాడి తర్వాత అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాను. ముందుగా నన్ను ఓవైసీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి కేర్ ఆసుపత్రికి తీసుకెళ్లారని తెలిసింది. కేర్ ఆసుపత్రిలో 20 రోజులపాటు చికిత్స పొందాను. కేర్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత మూడు శస్త్రచికిత్సలు జరిగాయి. జూలైలో గ్లోబల్ ఆసుపత్రిలో కడుపు భాగంలో, సెప్టెంబర్‌లో ఎడమ చేయి ఎముకను సరిచేసేందుకు శస్త్రచికిత్సలు జరిగాయి. దాడి సమయంలో మూత్రపిండం, పెద్దపేగు దెబ్బతిన్నాయి. మూత్రపిండం ఐరన్‌ను తీసుకునే పరిస్థితి లేకపోవడంతో 2012 జనవరిలో స్టంట్ వేశారు’’ అని అక్బరుద్దీన్ వివరించారు. ఇదిలా ఉండగా పహిల్వాన్ సహా ఇతర నిందితుల తరఫు న్యాయవాదులు గురువారం అక్బరుద్దీన్‌ను క్రాస్ఎగ్జామినేషన్ చేయనున్నారు. -
29 ఏళ్ల యువకుడికి..16 ఏళ్ల కుర్రాడి గుండె!
కేర్‌లో విజయవంతంగా శస్త్రచికిత్స సాక్షి, హైదరాబాద్: గుండె పనితీరు పూర్తిగా దెబ్బతిని చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు కేర్ వైద్యులు పునర్జన్మను ప్రసాదించారు. గుండె మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ప్రముఖ హృద్రోగ నిపుణుడు డాక్టర్ సోమరాజు, గుండె మార్పిడి నిపుణుడు డాక్టర్ రాజశేఖరరావు, సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ బీకేఎస్ శాస్త్రి శుక్రవారమిక్కడ వివరాలు వెల్లడించారు. బెంగళూర్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంతోష్ సుధీర్ సంఘవీకర్ (29) ఏడాదిన్నరగా హృద్రోగంతో బాధ పడుతున్నారు. విపరీతమైన ఆయాసంతో పాటు 4 అడుగుల దూరం కూడా నడవలేని పరిస్థితి. చికిత్స కోసం 6 మాసాల క్రితం నాంపల్లి కేర్ ఆస్పత్రి వైద్యులను ఆశ్రయించారు. గుండె కండరాలు బలహీనంగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అప్పటికే స్టంట్ వేసి ఉండటంతో గుండె మార్పిడి ఒక్కటే దీనికి పరిష్కారమని సూచించారు. నిజామాబాద్ విద్యార్థి గుండె దానం: ఇదే సమయంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన 16 ఏళ్ల విద్యార్థి ఈ నెల 7న రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. నల్లగండ్ల కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించగా అతడి పరిస్థితి విషమించడంతో వైద్యులు బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారించారు. వైద్యుల సూచన మేరకు విద్యార్థి అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారు. 26 కిలోమీటర్లు..13 నిమిషాల్లో : జీవన్‌దాన్ ద్వారా సమాచారం అందుకున్న కేర్ వైద్యులు కాంటినెంటల్ ఆసుపత్రికి చేరుకున్నారు. 26 కిలోమీటర్ల దూరంలోని ఆసుపత్రి నుంచి దాత గుండెను అంబులెన్స్‌లో తరలించాలని నిర్ణయించారు. ట్రాఫిక్ పోలీసుల సహాయంతో 13 నిమిషాల్లోనే నాంపల్లి కేర్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం 20 మంది వైద్యుల బృందం ఐదున్నర గంటల పాటు శ్రమించి విజయవంతంగా గుండె మార్పిడి శస్త్రచికిత్స చేశారు. గుండెను సేకరించిన 76 నిమిషాల్లోనే రక్త సరఫరాను పునరుద్ధరించినట్లు డాక్టర్ కేవీ రాజశేఖరరావు తెలిపారు. 2004 జూన్‌లో తొలిసారి గుండె మార్పిడి శస్త్రచికిత్స చేసిన తరువాత ఆస్పత్రిలో ఈ తరహా శస్త్రచికిత్స చేయడం మళ్లీ ఇదేనన్నారు. ప్రస్తుతం సంతోష్ కోలుకోవడంతో శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. -
లాఠీచార్జిలో గాయపడిన విద్యార్థి పరిస్థితి విషమం
రాజేంద్రనగర్‌లోని అగ్రికల్చర్ వర్సిటీలో మంగళవారం పోలీసుల లాఠీదెబ్బలతో తీవ్రంగా గాయపడిన రాకేష్ ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉండటంతో కేర్ ఆసుపత్రికి తరలించారు. వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి రాక సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెల్సిందే. మంత్రిని విద్యార్థులు నిర్బంధించటంతో పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. జీవో నెంబర్ 45ను వెంటనే వెనక్కి తీసుకోవాలని, పశువైద్య అధికారుల పోస్టులను డిపార్టుమెంటల్ పరీక్షల ద్వారానే ఎంపిక చేయాలంటూ పశువైద్య విద్యార్థులు మంత్రిని సమావేశమందిరంలోనే నిర్బంధించారు. గాయపడిన విద్యార్థి రాకేష్ వెటర్నరీ విభాగంలో 4వ సంవత్సరం చదువుతున్నాడు. విద్యార్థి సొంత జిల్లా వరంగల్. -
ఒకరిగా బతికి.. ముగ్గురిలో జీవించి..
ముగిసిన అవయవదాన శస్త్ర చికిత్సలు ఇద్దరికి కిడ్నీలు, మరొకరికి కాలేయం విశాఖ మెడికల్ : విశాఖనగరంలో మంగళవారం ఉదయం సెవెన్‌హిల్స్, కేర్ ఆస్పత్రుల్లో రెండు అవయవమార్పిడి శస్త్ర చికిత్సలు జరిగాయి. శ్రీకాకుళం పట్టణానికి చెందిన బ్రెయిన్‌డెడ్ రోగి పట్నాన సత్యనారాయణ అవయవదానంతో ముగ్గురిలో సజీవంగా నిలిచారు. ఈనెల 26న రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయమవడంతో అపస్మారక స్థితికి చేరుకున్న అతడిని అదే రోజు నగరంలోని సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో చేర్చగా ఆరోగ్య పరిస్థితి మెరుగుపడక పోవడంతో వైద్యులు బ్రైయిన్‌డెడ్ రోగిగా ప్రకటించిన విషయం విధితమే. అతని అవయవాలను దానం చేసేందుకు కుటుంబసభ్యులు ముందుకు రావడంతో మంగళవారం ఉదయం జీవన్‌ధాన్ సంస్థ అనుమతి మేరకు రెండు కిడ్నీలు, కాలేయాన్ని సేకరించారు. ఒక కిడ్నీని అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగికి డాక్టర్ రవిశంకర్, అమిత్ సాప్లేలు అవయవ మార్పిడి శస్త్రచికిత్స ద్వారా అమర్చారు. మరోకిడ్నీని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో రోగికి డాక్టర్ క ళ్యాణచక్రవర్తి, మురళీమోహన్ శస్త్రచికిత్స చేసి అమర్చారు. కాలేయాన్ని మాత్రం హైదరాబాద్‌లోని గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగికి అమర్చేందుకు మంగళవారం ఉదయం ప్రత్యేక విమానంలో తరలించారు. రాత్రి వరకు ఈ కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స కొనసాగుతున్నట్లు జీవన్‌ధాన్ విశాఖ కో-ఆర్డినేటర్ ఇందిర తెలిపారు. అతని శరీరంలోని కళ్లు, ఇతర శరీర అవయవాలు దెబ్బతినడంతో సేకరించేందుకు అవకాశం లేకుండా పోయిందని వెల్లడించారు. -
గుండెకు క్షయ ముప్పు
* గుర్తించిన కేర్ వైద్యులు * మెడికల్ జర్నల్‌లో డాక్టర్ నరసింహన్ కథనం సాక్షి, హైదరాబాద్: క్షయ అనగానే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధిగా భావిస్తారు. కానీ ఇప్పుడు ఈ వ్యాధి కారక బ్యాక్టీరియా తన రూటు మార్చుకుంది. గుండె వంటి కీలక అవయవాలకూ వ్యాపిస్తోంది. సకాలంలో గుర్తించకపోతే ప్రాణాంతకంగా మారుతోంది. కేర్ ఆసుపత్రి కార్డియాక్ ఎలక్ట్రోల్ ఫిజియాలజీ చీఫ్ డాక్టర్ నరసింహన్ తాజాగా ఈ విషయాన్ని గుర్తించారు. ఇప్పటికే గుండెకు క్షయ సోకిన 18 మందికి చికిత్స కూడా అందించారు. ఈ నేపథ్యంలో కేర్ ఆస్పత్రిలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుండెకు అరుదుగా సోకే క్షయకుగల కారణాలను ఆయన వివరించారు. సాధారణంగా క్షయ వ్యాధిని తీవ్రమైన దగ్గు, తెమడ వంటి లక్షణాలతో ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చన్నారు. అయితే ఇప్పుడు ఈ బ్యాక్టీరియా గుండెకు కూడా సోకుతుండడంతో త్వరగా వ్యాధిని గుర్తించలేక ప్రమాదకరంగా పరిణమిస్తోందన్నారు. దీనిపై ప్రస్తుతం పరిశోధన చేస్తున్నట్లు, ఇటీవలే ఓ మెడికల్ జర్నల్‌లో తాను రాసిన కథనం కూడా ప్రచురితమైనట్లు డాక్టర్ నరసింహన్ వెల్లడించారు. పరిశోధనల్లో భాగంగా ఈ బ్యాక్టీరియా గుండెలోని మయోకార్డియం కండరానికి ఇన్ఫెక్షన్ కలిగించే విషయం తెలిసిందన్నారు. దీన్ని పరీక్షల ద్వారా గుర్తించి నయం చేయవచ్చన్నారు. అయితే సకాలంలో గుర్తించకపోతే ఇబ్బందులు తలెత్తుతాయని హెచ్చరించారు. సమావేశంలో డాక్టర్ గోపీకృష్ణ, డాక్టర్ స్వప్న, కేర్ సీనియర్ మేనేజర్ ఎం.శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
డీవీ సుబ్బారావుకు అస్వస్థత
విశాఖపట్నం లీగల్ : ప్రముఖ న్యాయవాది, నగర మాజీ మేయర్,మాజీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండి యా ఛైర్మన్ డి.వి.సుబ్బారావు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం ఆయన్ను కుటుంబ సభ్యులు విశాఖపట్నంలోని కేర్ హాస్పటల్లో చేర్పించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. డీవీ గత కొంత కాలంగా శ్వాసకోశకు సంబంధించిన వ్యాధితో భాద పడుతున్నారు. కొన్ని రోజుల క్రితం చికిత్స తీసుకున్నారు. సుబ్బారావు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు న్యాయవాదులు,అభిమానులు హాస్పటల్ వద్దకు చేరుకున్నారు. తన తండ్రి ఆరోగ్యం నిలకడగానే ఉందని సుబ్బారావు తనయుడు తెలిపారు. -
సీసీ రెడ్డి అంత్యక్రియలు పూర్తి
కన్నీటి పర్యంతమైన స్నేహితులు, బంధువులు కుటుంబాన్ని ఓదార్చిన జగన్, విజయమ్మ సిటీబ్యూరో: విసు సంస్థల అధినేత, చలన చిత్ర నిర్మాత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు సీసీ రెడ్డి (చవ్వా చంద్రశేఖరరెడ్డి) భౌతిక కాయానికి గురువారం అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ నెల 6వ తేదీన కేర్ ఆసుపత్రిలో ఆయన మరణించిన విషయం తెలిసిందే. ఉదయాన్నే సీసీ రెడ్డి భౌతిక కాయాన్ని కేర్ హాస్పిటల్ నుంచి తీసుకువచ్చి జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంట్లో ప్రజల దర్శనార్థం ఉంచారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, ఆయన తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతి ఆయన భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబాన్ని ఓదార్చేందుకు ప్రయత్నించారు. సీపీఐ నేత డాక్టర్ కె. నారాయణ దంపతులు, ఏపీ రాష్ట్ర సీపీఐ కార్యదర్శి కె. రామకృష్ణ, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, సినీ డెరైక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పీఏసీ చైర్మన్ భూమా నాగిరెడ్డి, వైఎస్సార్ సీపీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, వైఎస్ అనిల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే టి.చెంచురెడ్డి, తదితరులు సీసీ రెడ్డి భౌతికకాయంవద్ద పుష్ప గుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అంతకంటే ముందుగా భౌతికకాయం వద్ద క్రైస్తవ మత పెద్దలు ప్రార్థనలు నిర్వహించారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో హిందూ సంప్రదాయం ప్రకారం వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య కుటుంబీకులు, బంధువులు కార్యక్రమాలు నిర్వహించారు. సీసీ రెడ్డి అమితంగా ఇష్టపడే పూలతో ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో బంధువులు, కుటుంబీకులు, విసు విద్యాసంస్థల సిబ్బంది వెంటరాగా సీసీ రెడ్డి పార్థివదేహాన్ని ముంబై హైవే మార్గంలోని మునిపల్లి మండలం గొర్రెగట్టు గ్రామం సమీపంలోని వ్యవసాయ క్షేత్రానికి తరలించి అక్కడ అంత్యక్రియలు నిర్వహించారు. ఇంటి నుంచి సీసీ రెడ్డి భౌతికకాయాన్ని తరలిస్తుండగా భార్య సుభద్రమ్మ, కుమార్తెలు, మనుమరాలు విరోనికా, సీసీ రెడ్డి శిష్యుడు బి. నాగరాజు , బంధువులు, స్నేహితులు ఒక్కసారిగా ఘెల్లుమన్నారు. ఆయనది ఆదర్శ జీవితం : మంచు లక్ష్మి అందరూ జీవితం ఎలా ఉండాలని ఆశపడతారో అంతకన్నా ఎక్కువగా గొప్ప జీవితాన్ని సీసీ రెడ్డి అనుభవించారని సినీ నటి మంచు లక్ష్మి తెలిపారు. ప్రేమ, ఆనందంతో కూడిన అద్భుతమైన జీవితాన్ని అనుభవించి, అందరికీ అన్నింట్లో ఆదర్శంగా నిలిచిన మహామనిషి సీసీ రెడ్డి తిరిగిరాని తీరాలకు వెళ్లటం బాధాకరమన్నారు. మానవతావాది: గేయ రచయిత రాంబాబు జీవితాన్ని ప్రేమించిన శ్రేయోభిలాషి, మహోన్నత మానవతావాది సీసీ రెడ్డి అని సినీ గేయ రచయిత వెనిగళ్ల రాంబాబు కొనియాడారు. ఆత్మహత్యల నివారణ కోసం ‘మీ శ్రేయోభిలాషి’ చిత్రాన్ని నిర్మించిన మహానుభావుడని చెప్పారు. తాను రాసిన ‘చిరునవ్వులతో బతకాలి.. చిరంజీవిగా బతకాలి’ అనేపాట సీసీ రెడ్డి హృదయానికి అక్షరరూపాలేనని తెలిపారు.