ఆడపిల్లని కాపాడదాం | Songs Recording Starts For Samajaniki Hecharika | Sakshi
Sakshi News home page

ఆడపిల్లని కాపాడదాం

Published Tue, Jan 22 2019 3:29 AM | Last Updated on Tue, Jan 22 2019 3:29 AM

Songs Recording Starts For Samajaniki Hecharika - Sakshi

ప్రియాంక, అలేఖ్య

‘సేవ్‌ గర్ల్‌ చైల్డ్‌’.. అంటే ఆడపిల్లని కాపాడదాం అని. ఇదే నినాదంతో ‘సమాజానికో హెచ్చరిక’ పేరుతో ఓ చిత్రం రూపొందుతోంది. చామకూరి కంబైన్స్‌ పతాకంపై చామకూరి. యమ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పాటల రికార్డింగ్‌ హైదరాబాద్‌లోని ఎస్‌.ఏ స్టూడియోలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో సీనియర్‌ నటుడు శివకృష్ణ, జబర్దస్త్‌ అప్పారావు, రాకింగ్‌ రాజేశ్, అలేఖ్య, ప్రియాంక, నటి గీతాసింగ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చామకూరి. యమ్‌ మాట్లాడుతూ– ‘‘ముగ్గురు యువకులు తమ కాళ్ల మీద తాము నిలబడుతూ, సమాజానికి ఎలా ఉపయోగపడ్డారో తెలియజేసే సినిమా ఇది. ఈ చిత్రానికి కథ, మాటలు నేను అందిస్తున్నా’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సుభాష్‌ ఆనంద్, పాటలు: సురేంద్ర కృష్ణ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement