shiva krishna
-
అదేం వెబ్ సిరీస్.. మన సంస్కృతి ఏమైపోతుంది: నటుడు షాకింగ్ రియాక్షన్
ఓటీటీలు వచ్చాక అడల్ట్ కంటెంట్, అభ్యంతరకర సన్నివేశాలతో వెబ్ సిరీస్‌లు ఎక్కువయ్యాయంటూ సీనియర్ నటుడు శివకృష్ణ అసహనం వ్యక్తం చేశారు. గతంలో సెన్సార్ బోర్డు సభ్యుడిగా పని చేసిన ఆయన తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా శివకృష్ణ మాట్లాడుతూ.. ఓటీటీ కంటెంట్‌కు కూడా సెన్సార్ ఉండాలన్నారు. ఈ మధ్య వెబ్ సిరీస్‌లో అభ్యంతరకర సన్నివేశాలు ఎక్కువైపోయాయని, రీసెంట్గా ఓ వెబ్ సిరీస్ చూశానంటూ ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ గురించి ఆయన చెప్పకనే చెప్పారు. చదవండి: ‘నాటు నాటు సాంగ్ పెడితేనే జెహ్ తింటున్నాడు, అది కూడా తెలుగులోనే’ ‘నిన్నే ఓ వెబ్ సిరీస్ చూశా. మరి దారుణంగా ఉంది. ఆల్ మోస్ట్ అది ఓ బ్లూ ఫిలిమే అని చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలో ఇలాంటి దారుణమైన సినిమా చూడలేదు. ఇది మన సంసృతి, కల్చర్ కాదు. ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమానా? అది’ అంటూ పైర్ అయ్యారు. అసలు ఇంట్లో బెడ్ రూమ్, కిచెన్ ఎందుకు ఉంటాయి. భార్య భర్తలు బెడ్రూంలో పడుకుంటారు. బెడ్ రూం తలుపులు తీసి ఉంచడం.. పిల్లలు అది చూడటం ఏంటి? మన సాంప్రదాయం ఇదేనా? ఏమైపోతుంది మన సంసృతి’ అంటూ ఫైర్ ఆయన మండిపడ్డారు. ఇలాంటి వాటి వల్లే పిల్లలు చెడిపోతున్నారన్నారు. చదవండి: ‘కోపంతో పుష్ప 2 సెట్ వీడిన రష్మిక!’ బన్నీనే కారణమంటూ ట్వీట్ ‘దేశం ఆర్థికంగా పతనమైనా తిరిగి కోలుకుంటుంది. కానీ, సంస్కృతి పరంగా పతనమైతే ఆ దేశాన్ని కాపాడటం కష్టం. సినిమాల్లో బూతు ఉంటే, థియేటర్స్‌కి వచ్చిన వారికి మాత్రమే అది తెలుస్తుంది. అదే వెబ్ సిరీస్‌లు అలా కాదు. ఇలాంటివి చూడకుండా పిల్లలను నియంత్రించడం కష్టమైపోతోంది. ఈ మధ్య కాలంలో చాలామంది పాడైపోవడానికి కారణం ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లే. అందుకే కచ్చితంగా ఓటీటీకి సెన్సార్ ఉండాల్సిందే’ అని శివకృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో ఆయన కామెంట్స్ విన్న నెటిజన్లంతా ఆయన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ ఉద్దేశించే మాట్లాడారంటూ కామెంట్స్ చేస్తున్నారు. -
ఆడపిల్లని కాపాడదాం
‘సేవ్ గర్ల్ చైల్డ్’.. అంటే ఆడపిల్లని కాపాడదాం అని. ఇదే నినాదంతో ‘సమాజానికో హెచ్చరిక’ పేరుతో ఓ చిత్రం రూపొందుతోంది. చామకూరి కంబైన్స్ పతాకంపై చామకూరి. యమ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పాటల రికార్డింగ్ హైదరాబాద్‌లోని ఎస్.ఏ స్టూడియోలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో సీనియర్ నటుడు శివకృష్ణ, జబర్దస్త్ అప్పారావు, రాకింగ్ రాజేశ్, అలేఖ్య, ప్రియాంక, నటి గీతాసింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చామకూరి. యమ్ మాట్లాడుతూ– ‘‘ముగ్గురు యువకులు తమ కాళ్ల మీద తాము నిలబడుతూ, సమాజానికి ఎలా ఉపయోగపడ్డారో తెలియజేసే సినిమా ఇది. ఈ చిత్రానికి కథ, మాటలు నేను అందిస్తున్నా’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సుభాష్ ఆనంద్, పాటలు: సురేంద్ర కృష్ణ. -
ప్రాణం తీసిన స్వైన్‌ఫ్లూ
ప్రకాశం జిల్లాలో స్వైన్‌ఫ్లూ మహమ్మారీ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పంగులూరు మండలం జాగర్లమూడివారి పాలెం గ్రామానికి చెందిన శివకృష్ణ స్వైన్‌ఫ్లూ రక్కసి దెబ్బకు నేలకొరిగాడు. హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో..... చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. ఎంతో ఆరోగ్యంగా ఉండే శివకృష్ణ నెలరోజుల కిందట.... హైదరాబాద్ వెళ్లి వచ్చాడు. తర్వాత రోజే జ్వరంతో మూలన పడ్డాడు. వెంటనే కుటుంబసభ్యులు అతన్ని ఒంగోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులకేమీ అంతుపట్టకపోవడంతో.... హైదరాబాద్ గాంధీకి తరలించారు. పరీక్షించిన వైద్యులు స్వైన్‌ఫ్లూగా నిర్ధారించారు. అప్పటి నుంచి అక్కడే ఉండే చికిత్స పొందుతుండగా....శనివారం పరిస్థితి విషమించడంతో ప్రాణాలు విడిచాడు. చేతికందిన కొడుకు కళ్ల ముందే కానరానిలోకాలకు వెళ్లడంతో...కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. -
సతియే దైవం
అతని పేరు శివకృష్ణ. వృత్తిరీత్యా డ్యాన్సర్. అక్కడే రాధతో అరుున పరిచయం కాస్తా స్నేహంగా చిగురించి..ఆపై ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుందామని ఇద్దరూ నిశ్చయించుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోయినా మూడు ముళ్లతో...ఏడడుగులతో అగ్నిసాక్షిగా ఒక్కటయ్యారు. జీవితాంతం ఒకరినొకరు తోడూనీడగా ఉంటామంటూ బాస చేసుకున్నారు.ఆనందంగా.. అరమరికలు లేకుండా జీవితం ప్రారంభించారు. వీరి ప్రేమకు గురుతులుగా ముగ్గురు పిల్లలు కలిగారు. ఇలా సాఫీగా సాగుతున్న వీరి జీవితంపై విధి చిన్నచూపు చూసింది. ఓ రోజు రోడ్డు ప్రమాదంలో రాధ మృతిచెందింది. అంతే రాధలేని జీవితాన్ని ఊహించుకుని కృష్ణ తల్లడిల్లిపోయాడు. కొన్ని రోజులకు బాధ నుంచి తేరుకున్నాడు. జీవితాంతం ప్రేమను పంచుతానన్న పెళ్లినాటి ప్రమాణాన్ని గుర్తు చేసుకున్నాడు. అంతే రాధ చిత్రపటానికి ప్రతి రోజూ పూలమాల వేస్తూ.... పిల్లలతో కలిసి పూజ చేస్తూ.. కొత్త జీవితం ఆరంభించాడు. మరోపెళ్లి చేసుకోవాలని బంధువులు ఒత్తిడి తెచ్చినా.. పిల్లలను తమకు అప్పగించాలని ఎవరెన్ని చెప్పినా వినలేదు. పిల్లలను అపురూపంగా పెంచుతూ.. ఆ రూపాల్లోనే భార్యను చూసుకుంటూ గడుపుతూ.. అసలైన ప్రేమకు సిసలైన నిర్వచనమిస్తున్నాడు. అవును.. కట్టుకున్న భార్య పుట్టింటి నుంచి కట్నకానుకలు తేలేదని చావబాదే భర్తలకు.. భార్య చనిపోతే నెల తిరక్కుండానే పెళ్లిళ్లు చేసుకునే ప్రబుద్ధులకు ఈ శివకృష్ణ ఓ కనువిప్పే కదూ.. సాక్షి, కడప/జమ్మలమడుగు: భార్య జ్ఞాపకంగా షాజహాన్ తాజ్‌మహల్ కట్టిస్తే.. తన భార్య తనువు చాలించినా తన గుండెల్లో గుడికట్టి.. ఆ దేవతకు రోజూ పూజలు చేస్తున్నాడు ఈ రిక్షావాలా శివ కృష్ణ. ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్యను మర్చిపోలేక గుండెలపై పచ్చబొట్టు కూడా పొడిపించుకున్నాడు. పిల్లలను తల్లికంటే మిన్నగా సాకుతూ నలుగురికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాడు. చిన్నారుల్లో సతీమణిని చూసుకుంటూ.... జమ్మలమడుగులోని గూడెంచెరువు చెందిన శివకృష్ణ. వృత్తిరీత్యా రికార్డింగ్ డ్యాన్సర్.. అక్కడే పరిచయమైన రాధతో ప్రేమలో పెద్దలు ఒప్పుకోకపోయినా పెళ్లి చేసుకున్నాడు. కొన్నేళ్ల తర్వాత ఓ రోజు రికార్డింగ్ డ్యాన్స్ కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా భార్య రాధ రాజంపేట వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఆ ప్రమాదంలో పెద్ద కుమార్తెకి కాలికి గాయమైంది. అయితే ఆమె తీపి గుర్తుగా ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడ్ని ఇచ్చి వెళ్లింది. సమాజంలో అట్టడుగు స్థానంలో ఉన్న శివకృష్ణ అందరికంటే ఉత్తమంగా ఆలోచించాడు. అందరూ పిల్లల్ని ఎక్కడో ఒక చోట వదిలి రెండో పెళ్లి చేసుకోమన్నారు. రికార్డింగ్ డ్యాన్సులు చేస్తే ఊళ్లు పట్టుకొని తిరగాలి.. పిల్లల్ని ఎలా పోషించగలవు అని భయపెట్టారు. కానీ పిల్లల్లోనే భార్యను చూసుకుంటున్న శివ ఆమెను తన గుండెల్లో నింపుకున్నాడు. పిల్లలకు తల్లితండ్రీ తానై నొప్పి తగలకుండా పెంచుతున్నాడు. డ్యాన్స్ వదిలేసి..రిక్షా తొక్కుతూ..! భార్య రాధ మరణంతో శివకు పిల్లల బెంగ పట్టుకుంది. కొంతమంది వచ్చి వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేశారు. సున్నితంగా తిరస్కరించాడు. పిల్లలను ఇక్కడ వదిలేసి రికార్డింగ్ డ్యాన్స్ నేపధ్యంలో ఎక్కడికైనా వెళితే వారి పరిస్థితి ఏమిటని ఆలోచన చేశాడు. పిల్లలను ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే పనిచేసుకోవాలని నిర్ణయించుకుని రిక్షా తొక్కేందుకు సిద్దమయ్యా డు. ఇక పొద్దున లేవగానే ఆయన దినచర్య భార్యకు పూజ చేయడంతోనే ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పిల్లలకి స్నానం చేయించడం, స్కూల్‌కి వెళ్లేందుకు సిద్ధం చేయడం.. సాయంత్రంకాగానే మళ్లీ తీసుకురావడం ఇలా అన్నీ ఆడవాళ్లకంటే మిన్నగా చేస్తున్నాడు. అలసటలోనే ఆనందం ఉందంటూనే చిన్నారులకు చిన్ని సమస్య కూడారాకుండా అల్లారుముద్దుగా పోషి స్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. అప్పుడప్పు డు శివ తరపు బంధువులు పిల్లల్ని తీసుకెళ్లినా.. తాను కష్టపడి పిల్లల్ని మంచి చదువులు చదివించాలని జమ్మలమడుగులోనే ఉం టూ బతుకు బండి లాగుతున్నా డు. చనిపోయినా తన భార్యకు హృదయంలో గుడికట్టి.. ఆ దేవతకు రోజూ పూజలు చేస్తూ.. ఆమె ప్రతి రూపాలుగా మిగిలిన పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న శివకృష్ణ ఈ తరం యువతకు స్ఫూర్తిదాయకమే కదూ.