songs recording
-
గూఢచారి 786
యాదాకృష్ణ టైటిల్ పాత్రలో నటిస్తూ, నిర్మిస్తోన్న తాజా చిత్రం ‘గూఢచారి 786’. ఈ చిత్రం ద్వారా రాజ్‌సుందర్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. యాదాకృష్ణ జన్మదినం సందర్భంగా ఇటీవల ఈ చిత్రం పాటల రికార్డింగ్ ప్రారంభమైంది. ‘గు గు గు గూఢచారి 786...’ అంటూ సాగే టైటిల్ సాంగ్‌ను రికార్డ్ చేశారు. వేల్పుల వెంకటేశ్ సంగీతంతో పాటు సాహిత్యం అందించారు. ఈ సందర్భంగా యాదాకృష్ణ మాట్లాడుతూ– ‘‘క్రైమ్, డిటెక్టివ్, కామెడీ, ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం ఉంటుంది. ఆరు పాటలు, ఐదు ఫైట్లు ఉంటాయి. జనవరి 30న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర సమర్పకులు తాజేష్ అలీబాబా, ఆర్. చంద్రారెడ్డి, నూకబోయిన వెంకట్రావ్, కెమెరామెన్ శివ తదితరులు పాల్గొన్నారు. -
ఆడపిల్లని కాపాడదాం
‘సేవ్ గర్ల్ చైల్డ్’.. అంటే ఆడపిల్లని కాపాడదాం అని. ఇదే నినాదంతో ‘సమాజానికో హెచ్చరిక’ పేరుతో ఓ చిత్రం రూపొందుతోంది. చామకూరి కంబైన్స్ పతాకంపై చామకూరి. యమ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పాటల రికార్డింగ్ హైదరాబాద్‌లోని ఎస్.ఏ స్టూడియోలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో సీనియర్ నటుడు శివకృష్ణ, జబర్దస్త్ అప్పారావు, రాకింగ్ రాజేశ్, అలేఖ్య, ప్రియాంక, నటి గీతాసింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చామకూరి. యమ్ మాట్లాడుతూ– ‘‘ముగ్గురు యువకులు తమ కాళ్ల మీద తాము నిలబడుతూ, సమాజానికి ఎలా ఉపయోగపడ్డారో తెలియజేసే సినిమా ఇది. ఈ చిత్రానికి కథ, మాటలు నేను అందిస్తున్నా’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సుభాష్ ఆనంద్, పాటలు: సురేంద్ర కృష్ణ. -
మరణానికి కొన్ని గంటల ముందు వరకు రికార్డింగ్!
గుండెపోటుతో మరణించడానికి కొన్ని గంటల ముందు వరకు కూడా చక్రి పాటల రికార్డింగులోనే గడిపారు. రికార్డింగ్ పూర్తయిన తర్వాత బాగా పొద్దుపోయాక ఇంటికి వచ్చారు. రాగానే కొద్దిసేపటికే నిద్రపోయిన చక్రి.. ఆ నిద్రలోనే తీవ్ర గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారని వైద్యులు చెబుతున్నారు. నిర్విరామంగా పనిచేయడం వల్ల ఆయన తీవ్రంగా అలసిపోయి ఉంటారని, అదే గుండెపోటు రావడానికి తక్షణ కారణం అయి ఉంటుందని భావిస్తున్నారు. చిన్న వయస్సులోనే తెలుగు సినీ సంగీతంలో ఇమేజ్ సాధించిన చక్రి తన ఆరోగ్యంపై పెద్దగా శ్రద్ధ చూపలేదని సన్నిహితులు అంటున్నారు. సినీ రంగంలోకి అడుగుపెట్టిన తొలి నాళ్లలో చక్రి మరీ ఇంత లావుగా ఉండేవారు కారు. ఆ తర్వాత ఆహార అలవాట్లలో మార్పు, సినీ పరిశ్రమలో తీరికలేని పనులు ఆయన శరీరంపై తీవ్ర ప్రభావం చూపించాయి. దానికి తోడు చక్రికి మంచి భోజన ప్రియుడనే పేరుంది. అది కూడా తోడవడంతో తక్కువ కాలంలో బాగా లావైపోయారు. లైపోసెక్షన్ లాంటి చికిత్స చేయించుకోవాలనుకున్నా, ఎందుకో భయపడ్డాడని ఆయన సన్నిహితులు అంటారు.