గూఢచారి 786 | goodachari 786 songs recording | Sakshi
Sakshi News home page

గూఢచారి 786

Published Fri, Jan 3 2020 2:05 AM | Last Updated on Fri, Jan 3 2020 2:05 AM

goodachari 786 songs recording - Sakshi

యాదాకృష్ణ

యాదాకృష్ణ టైటిల్‌ పాత్రలో నటిస్తూ, నిర్మిస్తోన్న తాజా చిత్రం ‘గూఢచారి 786’. ఈ చిత్రం ద్వారా రాజ్‌సుందర్‌ దర్శకునిగా పరిచయమవుతున్నారు. యాదాకృష్ణ జన్మదినం సందర్భంగా ఇటీవల ఈ చిత్రం పాటల రికార్డింగ్‌ ప్రారంభమైంది. ‘గు గు గు గూఢచారి 786...’ అంటూ సాగే టైటిల్‌ సాంగ్‌ను రికార్డ్‌ చేశారు. వేల్పుల వెంకటేశ్‌ సంగీతంతో పాటు సాహిత్యం అందించారు. ఈ సందర్భంగా యాదాకృష్ణ మాట్లాడుతూ– ‘‘క్రైమ్, డిటెక్టివ్, కామెడీ, ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం ఉంటుంది. ఆరు పాటలు, ఐదు ఫైట్లు ఉంటాయి. జనవరి 30న రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర సమర్పకులు తాజేష్‌ అలీబాబా, ఆర్‌. చంద్రారెడ్డి, నూకబోయిన వెంకట్రావ్, కెమెరామెన్‌ శివ తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement