జగిత్యాల మండలం చల్‌గల్ బస్టాండ్ వద్ద బుధవారం ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు.
జగిత్యాల(కరీంనగర్ జిల్లా): జగిత్యాల మండలం చల్‌గల్ బస్టాండ్ వద్ద బుధవారం ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. బస్టాండ్ వద్ద నిలిచి ఉన్న వ్యక్తిని కారులో వచ్చిన దుండగులు గొంతుకోసి పరారయ్యారు. మృతుడిని జగిత్యాల మండలం గోవిందపల్లికి చెందిన రాకేష్‌గా గుర్తించారు. హత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.