ప్రభుత్వ వైద్యుడిపై అత్యాచారయత్నం కేసు నమోదైన సంఘటన అదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం వెలుగుచేసింది. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో దంత వైద్యుడిగా పని చేస్తున్న రాకేష్(25) తన ఇంటి పక్కన ఉన్న గృహిణి(22) పై అత్యాచారానికి యత్నించాడు. దీంతో బాదితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న ఎసై్స శ్రీనివాసరావు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.