బాలికపై కన్నెసి లైంగిక దాడి.. విషయం బయటికి పొక్కడంతో.. | Girl Ends Life Over Molestation Adilabad | Sakshi
Sakshi News home page

బాలికపై కన్నెసి లైంగిక దాడి.. విషయం బయటికి పొక్కడంతో..

Published Fri, Dec 24 2021 7:54 AM | Last Updated on Fri, Dec 24 2021 8:22 AM

Girl Ends Life Over Molestation Adilabad - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న సీఐ అజయ్‌బాబు

సాక్షి,ఖానాపూర్‌(కొమరం భీం): ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడటంతోనే మనస్తాపం చెంది మండలంలోని సేవ్యానాయక్‌ తండాకు చెందిన బాలిక ఈనెల 19న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని సీఐ అజయ్‌బాబు తెలిపారు. గురువారం పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేవంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు. సీఐ కథనం ప్రకారం.. సేవ్యానాయక్‌ తండాకు చెందిన బాలిక, ఆమె తల్లి అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్‌ అనే యువకుడి ట్రాక్టర్‌పై కూలీ పనికి వెళ్లేవారు.

మైనర్‌ బాలికపై కన్నేసిన యువకుడు ఈనెల 18న లైంగికదాడికి పాల్పడ్డాడు. విషయం బయటికి పొక్కడంతో పెళ్లిచేసుకోవాలని బాలిక ఒత్తిడి తెచ్చింది. అయితే తనకు ఇప్పటికే నిశ్చితార్థం అయిందని, పెళ్లి చేసుకోలేనని యువకుడు తేల్చిచెప్పాడు. దీంతో అవమానంగా భావించిన బాలిక 19వ తేదీన ఇంట్లో చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. పోలీసుల విచారణలో శ్రీకాంత్‌ ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితుడిపై సెక్షన్‌ 376, 306తోపాటు పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. గురువారం స్థానిక బస్టాండ్‌ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకుని, రిమాండ్‌కు తరలించారు. కార్యక్రమంలో ఎస్సై రామునాయక్‌ పాల్గొన్నారు.

చదవండి: ఏడాది సహజీవనం.. మోజు తీరాక.. ప్లేటు ఫిరాయించి..


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement