హైదరాబాద్: సెల్‌ఫోన్‌లో మాట్లాడుతున్న విద్యార్థి పక్కనే ఉన్న విద్యుత్ తీగలను తాకి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన నగరంలోని వనస్థలిపురం ప్రశాంత్‌నగర్‌లో శనివారం చోటుచేసుకుంది. ఎల్బీనగర్‌లో నివాసముంటున్న రాకేష్ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు.
ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ప్రశాంత్‌నగర్‌లోని తన ఫ్రెండ్స్ రూమ్‌కు వచ్చాడు. బిల్డింగ్ పైన నిలబడి ఫోన్ మాట్లాడుతూ... ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న విద్యుత్ తీగలను తాకాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.