రాకేశ్‌ కుటుంబానికి రూ.25లక్షల ఎక్స్‌ గ్రేషియా | Telangana CM KCR Announces Rs 25 Lakh Job To Family Of Rakesh | Sakshi
Sakshi News home page

రాకేశ్‌ కుటుంబానికి రూ.25లక్షల ఎక్స్‌ గ్రేషియా

Published Sat, Jun 18 2022 2:45 AM | Last Updated on Sat, Jun 18 2022 2:41 PM

Telangana CM KCR Announces Rs 25 Lakh Job To Family Of Rakesh - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అగ్నిపథ్‌ నియామక ప్రక్రియను వ్యతిరేకిస్తూ శుక్రవారం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో నిరుద్యోగులు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో రైల్వే పోలీసులు జరిపిన కాల్పుల్లో వరంగల్‌ జిల్లాకు చెందిన రాకేశ్‌ మృతిచెందడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తంచేశారు.

కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ విధానాలకు బలైపోయిన బీసీ బిడ్డ రాకేశ్‌ కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియాతోపాటు, ఆ కుటుంబంలో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాల వల్లనే రాకేశ్‌ బలయ్యాడని విచారం వ్యక్తంచేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement