రాహుల్, రేహన్‌లు కూడా
సాక్షి, హైదరాబాద్: ఎయిర్‌టెల్ సంస్థ నిర్వహించిన ‘సాకర్ రైజింగ్ స్టార్స్’ శిబిరంలో నగరానికి చెందిన నలుగురు కుర్రాళ్లు మెరిశారు. నాగరాజు, రాకేశ్, రాహుల్, రేహన్‌లు హైదరాబాద్ నుంచి ఫైనల్ సెలక్షన్ ట్రయల్స్‌కు ఎంపికయ్యారు. ఈ తుది ఎంపిక ప్రక్రియ ఈ నెల 20 నుంచి గోవాలో రెండు రోజుల పాటు జరుగనుంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాలలో అండర్-16 విభాగంలో నిర్వహించిన ప్రత్యేక శిక్షణ శిబిరాల నుంచి మొత్తం 23 మంది ప్రతిభావంతులను ఎంపిక చేశారు. ఈ జాబితా నుంచి తుది 11 మంది కుర్రాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేస్తారు.
తుది జట్టులో ఒక గోల్‌కీపర్ ఉంటాడు. ఈ జట్టును గోవాలోనే ఈ నెల 21న ప్రకటిస్తారు. వీరికి ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్లబ్ అయిన మాంచెస్టర్ యునెటైడ్ కోచ్‌లు ఆటలో మెళకువలు నేర్పిస్తారు. ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ యునెటైడ్ సాకర్ స్కూల్‌లో వారం పాటు ఈ శిబిరం జరుగుతుంది. హైదరాబాద్‌తో పాటు కోల్‌కతా, ఢిల్లీ, బెంగళూరు, ముంబై, గువాహటి, గోవా నగరాల్లో ఎయిర్‌టెల్ రైజింగ్ స్టార్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
‘రైజింగ్ స్టార్స్’ నాగరాజు, రాకేశ్
Published Wed, Feb 19 2014 12:09 AM | Last Updated on Tue, Sep 4 2018 4:52 PM
Advertisement
Advertisement