సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతరలో అపశ్రుతి నెలకొంది. లష్కర్ బోనాల ఉత్సావాల్లో భాగంగా పలహార బండ్ల ఊరేగింపులో విద్యుత్ షాక్ తగిలి ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడిని కార్వాన్ ప్రాంతానికి చెందిన ఆకాష్‌గా(23) గుర్తించారు.
మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన ఆకాష్.. ఆదివారం రాత్రి విద్యుత్ స్తంభాన్ని ముట్టుకోవడంతో షాక్ తగిలి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ మార్చురీ తరలించారు. కాగా నిన్న రాత్రి కురిసిన వర్షం కారణంగా కరెంట్ పోల్‌కు పవర్ రావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు చారిత్రక సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర ఆదివారం వైభవంగా జరిగింది. సీఎం కేసీఆర్ దంపతులతో పాటు వేలాది మంది భక్తులు అమ్మవారికి బోనాలు, సాక, తొట్టెలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సోమవారం మహంకాళి ఆలయంలో రంగం కార్యక్రమం జరిగింది. రంగంలో మాతంగి స్వర్ణలత భవిష్కవాణి వినిపించారు. ఈ ఏడాది అగ్ని ప్రమదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్వర్ణలత చెప్పారు. కాస్తా ఆలస్యమైనా మంచి వర్షాలు కురుస్తాయని తెలిపారు. ప్రజలు ఎలాంటి భయందోళన చెందవద్దని అన్నారు.
చదవండి: ఈటల, అర్వింద్‌కు భద్రత పెంపు.. కేంద్రం కీలక నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment