న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రోడ్డు ప్రమాదాలు ఇటీవల ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఢిల్లీలోని హై సెక్యూరిటీ వీఐపీ జోన్‌లో కంఝవాలా తరహా ఘటన చోటుచేసుకుంది. వేగంగా ప్రయాణిస్తున్న కారు టూవీలర్‌ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి ఊహించని రీతిలో ప్రాణాలు కోల్పోగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దారుణం కస్తూర్భా గాంధీ మార్గంలో శనివారం అర్థరాత్రి జరిగింది. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను రోడ్డు మీద వెళ్తున్న మరో వ్యక్తి తన ఫోన్‌లో చిత్రీకరించడంతో ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
టాల్‌స్టాయ్ మార్గ్ కూడలి వద్ద బైక్‌పై వెళుతున్న ఇద్దరు యువకులను మహింద్రా ఎక్స్‌యూవీ కారు ఢీకొట్టింది. దీంతో బైక్ పైన ఉన్న ఓ వ్యక్తి కారుపై పడ్డాడు. మరో వ్యక్తి రోడ్డుపై ఎగిరి పడ్డాడు. ఇంత ఘోరం జరిగిన తర్వాత కూడా డ్రైవర్ కారును ఆపకుండా.. పైన వ్యక్తిని అలాగే ఉంచి వేగంగా వెళ్లనిచ్చాడు. దీన్నంతటినీ ప్రత్యక్షసాక్షి అయిన మహ్మద్ బిలాల్ తన స్కూటీతోపాటు కారును వెంబడిస్తూ వీడియో తీశాడు. హారన్ కొడుతూ, అరుస్తూ డ్రైవర్‌ను అప్రమత్తం చేసేందుకు ప్రయత్నించినప్పటికీ కారు ఎంతకూ ఆపలేదు. అలాగే 3 కిలోమీటర్లు పోనిచ్చాడు.
చదవండి: కర్నాటక: ఎన్నికల సిత్రం.. మామిడిచెట్టులో కరెన్సీ కట్టల బ్యాగు
అనంతరం గాయపడిన వ్యక్తిని ఢిల్లీ గేట్ సమీపంలో కారు నుంచి కింద పడవేసి అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో యువకుడి తలకు తీవ్ర గాయమవ్వడంతో అక్కడికక్కడే మరణించాడు. మృతుడిని 30 ఏళ్ల దీపాంశు వర్మగా గుర్తించారు. ఈ ఘటనలో గాయపడిన అతని బంధువు 20 ఏళ్ల ముకుల్ పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. కారు నడిపిన వ్యక్తి హర్నీత్ స్ంగ్ చావ్లాను అరెస్టు చేశారు. అతనితో పాటు అతని కుటుంబం కూడా కారులో ఉన్నట్లు గుర్తించారు. ప్రమాద సమయంలో డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
చదవండి: ది కేరళ స్టోరీ విడుదల వివాదం.. తమిళనాడు ప్రభుత్వానికి హెచ్చరిక
#WATCH | Man Dies In Delhi Hit-And-Run, Seen Lying On Roof As Car Driven For 3 Km
— Subodh Kumar (@kumarsubodh_) May 3, 2023
Following a car hit a motorcycle one of the men on a motorcycle was thrown several feet away, while the other landed on the roof of the car
Incident took place at the intersection of Kasturba… pic.twitter.com/7ta267NDjT
Comments
Please login to add a commentAdd a comment