దారుణం: భూత వైద్యం పేరుతో ఈత బరిగెలతో కొట్టడంతో.. | Man Deceased With Exorcism In Kurnool District | Sakshi
Sakshi News home page

దారుణం: భూత వైద్యం పేరుతో ఈత బరిగెలతో కొట్టడంతో..

Published Mon, Jun 7 2021 11:15 AM | Last Updated on Mon, Jun 7 2021 2:24 PM

Man Deceased With Exorcism In Kurnool District - Sakshi

కర్నూలు: భూత వైద్యం ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. మద్దికెర మండలం పెరవలికి చెందిన వెంకటరాముడు, ఈరమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. అయితే ఈ నెల 1న వారి కుమారుడు నరేష్(24) మూర్ఛతో ఆస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతని తల్లిదండ్రులు ఓ భూత వైద్యుడి వద్దకు తీసుకువెళ్లారు. ఆ భూత వైద్యుడు నరేష్‌కు దెయ్యం పట్టిందని, ఇంట్లో బంధించి ఈత బరిగెలతో తీవ్రంగా కొట్టాడు.

దీంతో అతని ఆరోగ్యం మరింత క్షిణించింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు నరేష్‌ తల్లిదండ్రులను మందలించి పలువురు చందాలు వేసుకొని అతన్ని ఆస్పత్రికి తరలించారు. నరేష్‌ చికిత్స పొందుతూ మృతి చెందాడు. భూతవైద్యం కారణంగా ఓ యువకుడు మృతి చెందడంతో పెరవలి గ్రామంలో విషాదం అలుముకుంది.
చదవండి:  వ్యభిచారం చేయకపోతే చంపేస్తామంటూ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement