exorcism doctor
-
ఓ అమ్మయి కన్నీటి గాథ.. ఆరు ప్రేతాత్మలు ఆరేళ్లపాటు వేధించి.. అతి క్రూరంగా..!!
The Real Story Behind ‘The Exorcism of Emily Rose’ Is More Terrifying Than the Movie: దేవుడి ప్రస్తావన వచ్చినప్పుడల్లా దెయ్యం ఉనికి గురించీ వింటూనే ఉన్నాం.. నమ్ముతూనే ఉన్నాం. ఆ వినికిడి సారాంశం, నమ్మకపు ప్రభావం..‘దెయ్యాలు క్రూరమైన వి, విచక్షణ లేకుండా ప్రవర్తిస్తుంటాయి.. వాటికి దేవుడంటే భయం’ అని! కానీ దైవశక్తికి సైతం లొంగని ఆరు ప్రేతాత్మలు.. ఆరేళ్ల పాటు ఓ అమ్మాయి శరీరాన్ని ఆవహించి, అనుక్షణం నరకయాతన పెట్టాయి. చివరికి క్రూరంగా చంపేశాయి. 2005లో ప్రపంచాన్ని వణికించిన ‘ది ఎక్సార్సిజం ఆఫ్ ఎమిలీ రోజ్’ అనే సినిమా కల్పిత కథ కాదు, 1976లో ముగిసిన ఓ అమ్మాయి నిజ జీవిత వ్యథ. జర్మనీ చరిత్రలో సంచలనంగా మిగిలిన ‘అన్నెలీస్ మిషెల్’ కన్నీటి గాథ నేటికీ ఓ మిస్టరీనే. ఉన్నట్టుండి నవ్వడం, క్రూరంగా చూడటం.. ఎంతటి బలవంతుడినైనా ఒంటిచేత్తో నొక్కిపెట్టి కదలకుండా చెయ్యగలగడం, పైకి లేచి చేతులు చాచి.. వికృతంగా ప్రవర్తించడం, తనని తాను బాధించుకోవడం.. కాళ్లతో పాటు చేతులనూ ఉపయోగించి మెట్లు దిగడం.. మనిషి మొత్తం రకరకాల మెలికలు తిరగడం.. ఇదంతా నేటి హారర్ చిత్రాల్లో సాధారణంగా కనిపించే దృశ్యాలు.కానీ దెయ్యం ఆవహిస్తే అలాగే ప్రవర్తిస్తారు అని మొదటిసారిగా ప్రపంచానికి తెలిసింది మాత్రం అన్నెలీస్ని చూసినప్పుడే! అన్నెలీస్.. పశ్చిమ జర్మనీ, బవేరియాలోని లీబ్లిఫింగ్లో 1952, సెప్టెంబర్ 21న పుట్టింది. జోసెఫ్, అన్నా మిషెల్ ఆమె తల్లిదండ్రులు. వాళ్లు రోమన్ కేథలిక్స్. అన్నెకు ముగ్గురు సోదరీమణులు. చిన్ననాటి నుంచి దైవభక్తి కలిగిన ఆమె.. తల్లిదండ్రులతో పాటు వారంలో రెండుసార్లు చర్చికి హాజరయ్యేది. అలాంటి అన్నె.. ఉన్నట్టుండి దేవుడ్ని ద్వేషించడం మొదలుపెట్టింది. ఆమెకు 16 ఏళ్ల వయసులో అకస్మాత్తుగా ఆరోగ్యం దెబ్బతింది. వ్యాధి లక్షణాలను బట్టి మూర్ఛగా, మానసిక రుగ్మతగా గుర్తించిన వైద్యులు.. ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందించారు. ‘ఆత్మలు కనిపిస్తున్నాయి’ అంటూ భయపడసాగింది అన్నె. అదంతా వ్యాధి లక్షణాల్లో భాగమే అన్నారు వైద్యులు. దేవుడ్ని ప్రార్థిస్తున్న సమయంలో ఎవరో.. ‘నువ్వు నరకంలో కుళ్లిపోతున్నావు’ అంటున్నారని చెప్పేది ఆ అమ్మాయి. దాన్నీ మానసిక సమస్యగానే పరిగణించారు. కాలక్రమేణా జీసస్ చిత్రాన్ని చూసినా, శిలువను చూసినా వింతవింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. దైవక్షేత్రాల్లోకి వెళ్లాలంటే భయపడేది. బలవంతంగా ప్రార్థన స్థలాలకు తీసుకుని వెళ్తే.. నేల కాలిపోతోంది, కాళ్లు మంటలు పుడుతున్నాయనేది. అన్నె ప్రవర్తన చూసిన ఆమె స్నేహితులకు, కుటుంబసభ్యులకు ‘ఆమెను ఆత్మ ఆవహించిందా?’ అనే అనుమానం బలపడింది. అదే భయంతో అన్నెకు భూతవైద్యం అందించాలని చర్చి ఫాదర్ ఎర్నస్ట్ అల్ట్ను ఆశ్రయించారు. అయితే అప్పటికే భూతవైద్యంపై కఠిన నియమాలు ఉండటంతో వెంటనే అనుమతి లభించలేదు. చివరికి.. అన్నె స్వయంగా అల్ట్కు లేఖ రాసింది. ‘నాకు ఆరోగ్యంగా జీవించాలనుంది. నా గురించి ప్రార్థించండి. జనుల కోసం బాధను అనుభవిస్తాను. కానీ, ఈ నరకం చాలా భయానకంగా ఉంది. తట్టుకోలేకపోతున్నాను’ అంటూ. అది చదివిన ఫాదర్ అల్ట్ మనసు కరిగి, ఆ లేఖను బిషప్ జోసెఫ్ స్తంగల్కు చూపించారు. దాంతో బిషప్.. ప్రీస్ట్ ఆర్నాల్డ్ రెంజ్‌కు భూత వైద్యం చేసేందుకు అనుమతి ఇచ్చాడు. కానీ ఇదంతా రహస్యంగా జరగాలని ఆదేశించారు. 1975 సెప్టెంబర్ 24 నుంచి అన్నెకు మందులు ఇవ్వడం మానేసి, భూతవైద్యం మొదలుపెట్టారు. మొత్తం వైద్యపద్ధతిని, అన్నె ప్రవర్తనని.. వీడియోల రూపంలో, ఆడియోల రూపంలో రికార్డ్ చేశారు. నేటికీ వాటిని నెట్లో వినొచ్చు, చూడొచ్చు. ఆమె మాట్లాడుతున్నప్పుడు ఆరు గొంతులు వినిపించేవి. అవి ప్రేతాత్మలవని గుర్తించారు భూతవైద్యులు. వాటి పేర్లు లుసీఫర్, కైన్, జుదాస్ ఇస్క్రీయాట్, బెలీయల్, లెజియాన్, నెరో అని తేల్చారు. కానీ వాటిని అన్నె శరీరంలో నుంచి వెళ్లగొట్టడంలో విఫలమయ్యారు. వారానికి రెండు మూడు రోజులు 4 గంటల చొప్పున.. 67 సార్లు ఆమెకు భూతవైద్యాన్ని అందించారు. అయినా ఫలితం లేదు. ఆ నరకం భరించలేక అన్నె 1976, జులై 1న తన 23వ ఏట చనిపోయింది. అప్పుడే ప్రపంచం అన్నే కథవైపు తిరిగి చూసింది. ఈ మరణానికి బిషప్ ఆదేశాలతో చేసిన భూత వైద్యమే కారణమని పోలీసులు కేసు నమోదు చేశారు. అందుకు సహకరించిన అన్నె తల్లిదండ్రులనూ అరెస్ట్ చేశారు. అన్నె సుమారు 10 నెలలు ఆహారం తినలేదని, పౌష్టికాహార లోపంతో ఆమె చనిపోయిందని, ఎముకలన్నీ ఛిద్రమై, మాంసం ముద్దలా మారిందని, కేవలం 30 కేజీల బరువు ఉందని పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చింది. ఆమెను ప్రేతాత్మలు ఆవహించాయని చెప్పేందుకు.. భూతవైద్యులు రికార్డు చేసిన వీడియో, ఆడియో టేపులను కోర్టు ముందు ఉంచడంతో.. అవే వారిని కాపాడాయి. అన్నె తన మూత్రాన్ని తానే తాగేదని, తనని తాను గాయపరచుకొనేదని సాక్షులు తెలిపారు. తల్లిదండ్రులు తెచ్చిన ఆహారాన్ని విసిరికొట్టడం, అన్నే వింతగా ప్రవర్తించడం అన్నింటికీ సాక్ష్యాలు ఉండటంతో కోర్టు నమ్మింది. అందరినీ విడుదల చేసింది. ‘ప్రేతాత్మల కారణంగా చనిపోవడంతో పద్ధతి ప్రకారం అంత్యక్రియలు చెయ్యలేకపోయాం.. మరోసారి ఆ అవకాశం ఇవ్వాలి’ అని కోర్టుని కోరారు అన్నె తల్లిదండ్రులు. కోర్టు అంగీకారంతో.. రెండేళ్ల తర్వాత ఆమె అస్థికలను బయటకు తీసి మరో నాణ్యమైన శవపేటికలో పెట్టి పూడ్చిపెట్టారు. అన్నె అనారోగ్యంతో బాధపడుతుంటే భూతవైద్యం చేసి, తిండిపెట్టకుండా చంపేశారని, తల్లిదండ్రుల ఒత్తిడి, కఠిన నియమాలు, చాదస్తం కారణంగానే అన్నె పిచ్చిదైందనే పలు విమర్శలు వచ్చాయి. సరిగ్గా 37 ఏళ్ల తర్వాత 2013, జూన్ 6న అన్నెలీస్ మిషెల్ నివాసమున్న ఇల్లు అగ్నికి ఆహుతి అయ్యింది. ఎవరూలేని ఇంట్లో మంటలు ఎలా వ్యాపించాయనేది మరో మిస్టరీ. పైగా ఆ మంటల్లో తమకు అన్నెలీస్ ఆత్మ కనిపించిందని స్థానికులు ఫొటోలు, వీడియోలు షేర్ చేయడం సంచలనమైంది. దాంతో ఈ కథ మరోసారి తెర మీద కొచ్చింది. సంఖ్యాశాస్త్రం ప్రకారం.. ఆరవ నెల, ఆరవ తేదీ.. 2013లోని అంకెలు కలిపితే ఆరు, కాబట్టి.. ‘666 అనే నంబర్ దెయ్యాల సంఖ్య’ అంటూ మీడియా కూడా అప్పట్లో ప్రచారం చేసింది. దాంతో అగ్నిప్రమాదానికి కారణం ప్రేతాత్మలేనని కొందరు భయాందోళనలకు గురయ్యారు. మరికొందరు కొట్టిపారేశారు. - సంహిత నిమ్మన చదవండి: Crime Story: తన హత్యకు తానే పథకం వేసుకున్నాడు.. ద్రోహి! -
దారుణం: భూత వైద్యం పేరుతో ఈత బరిగెలతో కొట్టడంతో..
కర్నూలు: భూత వైద్యం ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. మద్దికెర మండలం పెరవలికి చెందిన వెంకటరాముడు, ఈరమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. అయితే ఈ నెల 1న వారి కుమారుడు నరేష్(24) మూర్ఛతో ఆస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతని తల్లిదండ్రులు ఓ భూత వైద్యుడి వద్దకు తీసుకువెళ్లారు. ఆ భూత వైద్యుడు నరేష్‌కు దెయ్యం పట్టిందని, ఇంట్లో బంధించి ఈత బరిగెలతో తీవ్రంగా కొట్టాడు. దీంతో అతని ఆరోగ్యం మరింత క్షిణించింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు నరేష్ తల్లిదండ్రులను మందలించి పలువురు చందాలు వేసుకొని అతన్ని ఆస్పత్రికి తరలించారు. నరేష్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. భూతవైద్యం కారణంగా ఓ యువకుడు మృతి చెందడంతో పెరవలి గ్రామంలో విషాదం అలుముకుంది. చదవండి: వ్యభిచారం చేయకపోతే చంపేస్తామంటూ -
ముగిసిన రజిత ప్రేమ ప్రయాణం
సాక్షి, శంకరపట్నం: ప్రేమే ప్రాణమనుకున్న రజితకు..ప్రేవిుంచిన భర్త వైద్యం పేరిట చిత్రహింసలకు గురిచేయడంతో నాలుగునెలల చిట్టితల్లిని వదిలి చితిపైకి వెళ్లింది. ఈ సంఘటన పలువురిని కలిచివేసింది. వివరాలు ఇలా.. శంకరపట్నం మండలం గద్దపాక గ్రామానికి చెందిన కనుకుంట్ల రజితకు పుట్టినప్పటి నుంచే కష్టాలు మొదలయ్యాయి. పుట్టిన రెండు, మూడురోజులకే తల్లి స్వరూప కన్నుమూసింది. తండ్రి నర్సయ్య ఊళ్లో పశువుల కాపరీగా పనిచేసి కూతురు ఆలనాపాలన చూసేవాడు. కొన్నేళ్లకు రజిత తండ్రి నర్సయ్య పద్మను రెండో వివాహం చేసుకున్నాడు. సాఫీగా సాగుతున్న క్రమంలో గద్దపాక వాగులోని బావిలో ప్రమాదవశాత్తు పడి రజిత తండ్రి నర్సయ్య పదేళ్లక్రితం మృతిచెందాడు. పినతల్లి పద్మ రజితను ఉన్నత చదువులు చదివించింది. రజిత పెళ్లినాటి ఫోటో ఈ క్రమంలో హైదరాబాద్‌లో పనిచేస్తున్న చోట మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కుందారం గ్రామానికి చెందిన వ్యక్తితో పరిచయం ప్రేమగా మారింది. నాలుగుమాసాలక్రితం రజిత ఆడపిల్లకు జన్మనిచ్చింది. కొన్నినెలలుగా రజిత అనారోగ్యానికి గురికాగా వారంక్రితం భూతవైద్యుడు దొగ్గల శ్యామ్‌ను తీసుకువచ్చారు. భూతవైద్యం పేరుతో రజితకు దయ్యం పట్టిందని తలవెంట్రుకలు పట్టుకుని విచక్షణరహితంగా కొడుతూ మంచంపై పడేయడంతో తలకు గాయమైంది. ఐదురోజులక్రితం కరీంనగర్ ప్రైవేట్ ఆçస్పత్రిలో చేర్పించి చికిత్సచేస్తుండగా సోమవారం అర్థరాత్రి మృతిచెందింది. (పెళ్లింట భారీ చోరీ) గద్దపాకలో అంత్యక్రియలు మంచిర్యాల జిల్లా కుందారంలో భూతవైద్యానికి బలైన రజిత అంత్యక్రియలు శంకరపట్నం మండలం గద్దపాక గ్రామంలో పుట్టిన ఊరిలో మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. భూతవైద్యంతో రజిత ప్రాణాలు బలిగొన్న అత్తింటివారితోపాటు భూతవైద్యుడికి సహకరించిన బాబాయ్ రవీందర్‌పై జైపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కరీంనగర్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందగా, రజిత మృతదేహానికి సివిల్‌ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాన్ని గద్దపాకకు తీసుకురాగా హత్యానేరంతో అత్తింటి వారు రాకపోవడంతో పినతల్లి, స్థానికులు అంత్యక్రియలు నిర్వహించారు. భూతవైద్యుడి చేతిలో ప్రాణాలు వదిలిన రజిత అంత్యక్రియల్లో మహిళలు తరలివచ్చి పాల్గొన్నారు. నాలుగునెలల చిన్నారి అనాథగా మారిందని పలువురు కంటతడిపెట్టారు. -
బాలింతను బలి తీసుకున్నారు
జైపూర్ (చెన్నూర్): భూతవైద్యం పేరిట చిత్రహింసలకు గురైన బాలింత చివరకు మృతి చెందింది. దెయ్యం పట్టిందని భూతవైద్యుడు ఆమెను తీవ్రంగా కొట్టడంతో కోమాలోకి వెళ్లిన విషయం తెలిసిందే. నాలుగు రోజులుగా చికిత్స పొందుతూ మంగళవారం ఆమె తుదిశ్వాస విడిచింది. పోలీసుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కుందారం గ్రామానికి చెందిన సెగ్యం మల్లేశ్ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాకకు చెందిన రజితను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. మూడు నెలల క్రితం రజిత పండంటి పాపకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి మల్లేశ్ కట్నం కోసం రజితను వేధించడం మొదలు పెట్టాడు. అతడికి కుటుంబసభ్యులు కూడా జత కలిశారు. ఎలాగైనా రజితను వదిలించుకోవాలని పథకం రచించారు. రజితను దెయ్యం ఆవహించిందని, అందుకే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తోందని ఇరుగు పొరుగు వారిని నమ్మించారు. అంతటితో ఆగక ఓ భూతవైద్యుడిని పిలిపించి మరీ చిత్రహింసలు పెట్టించారు. దెబ్బలు తాళలేక రజిత మంచంపై పడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది. దీంతో కోమాలోకి వెళ్లిన ఆమెను ఈ నెల ఒకటిన కరీంనగర్‌లోని ప్రతిమ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న రజిత.. సోమవారం అర్ధరాత్రి కన్నుమూసింది. దీంతో తల్లి ఒడిలో ఆడుకోవాల్సిన ఆ పసిపాప 3 నెలలకే అనాథగా మారింది. తల్లిపాల కోసం ఆ పసి హృదయం ఏడుస్తున్న సంఘటనను చూసి స్థానికుల గుండె తరుక్కుపోతోంది. -
ప్రాణాలు కోల్పోయిన రజిత
-
భూతవైద్యం: ప్రాణాలు కోల్పోయిన రజిత
సాక్షి, కరీంనగర్: బాలింతను భూతవైద్యుడు వైద్యం పేరిట చిత్రహింసలు పెట్టిన ఘటనలో రజిత ప్రాణాలు కోల్పోయింది. భూతం ఆవహించిందని, చేతబడికి గురైందన్న నెపంతో చిత్రహింసలకు గురి చేయడంతో సృహతప్పి పడిపోయిన రజిత కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. గతవారం రోజుల క్రితం రజితకు దైయ్యం పట్టిందని అత్తవారి ఇంటివద్ద మంచిర్యాల జిల్లా కుందారంలో కుటుంబ సభ్యులు భూత వైద్యం చేయించారు. వైద్యం పేరుతో దొగ్గల శ్యామ్ తలవెంట్రుకలు లాగుతు, విచక్షణ రహితంగా కొట్టి మంచంపై పడేయడంతో తలకు గాయమయ్యింది. సృహతప్పి పడిపోవడంతో అత్తింటి వారు రజితను కరీంనగర్ లోని ప్రతిమ ఆసుపత్రికి తరలించారు. ఐదురోజులుగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి ప్రాణాలు కోల్పోయారు. భూత వైద్యుడు శ్యామ్‌తో పాటు అతనికి సహకరించిన రజిత బాబాయి రవీందర్‌ను మూడురోజుల క్రితం జైపూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అత్తింటి వారిపై కేసు నమోదు చేసి విచారణ ముమ్మరం చేశారు. రజిత స్వగ్రామం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాక కాగా తల్లిదండ్రులు లేకపోవడంతో ఏడాదిన్నర క్రితం మల్లేష్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. వారికి నాలుగు నెలల పాప ఉంది. పెళ్లయిన కొద్ది రోజుల నుంచి అనారోగ్యం పాలైన రజితకు దెయ్యం పట్టిందని భూతవైద్యుడి తో వైద్యం చేయించారు. భూతవైద్యుడు కొట్టిన దెబ్బలకే రజిత ప్రాణాలు కోల్పోయిందని రజిత పుట్టింటి వారు ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. (దెయ్యం పట్టిందని బాలింతకు భూత వైద్యం) -
భూతవైద్యం పేరిట బాలింతకు చిత్రహింసలు
జైపూర్ : భూతం ఆవహించిందని, చేతబడికి గురైందన్న నెపంతో ఓ బాలింతను మాంత్రికుడు వైద్యం పేరిట హింస పెట్టిన ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కుందారం గ్రామంలో చోటుచేసుకుంది. ఓ వైపు ప్రేమించి పెళ్లాడిన భర్త వేధింపులు.. మరోవైపు చేతబడులకు గురైందన్న నెపంతో బాలింత అని కూడా చూడకుండా చిత్రహింసలు గురి చేయడం సంచలనం రేపింది. మాంత్రికుడి దెబ్బలకు యువతి స్పృహ కోల్పోవడంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. దీంతో మూడు నెలల పసికందు ఆ తల్లికి దూరమైంది. జైపూర్ మండలం కుందారం గ్రామానికి చెందిన సెగ్యం మల్లేశ్, కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాక గ్రామానికి చెందిన రజిత గతేడాది ప్రేమ వివాహం చేసుకున్నారు. రజిత గర్భిణి అయినప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో ఆమెకు పలు ప్రాంతాల్లో వైద్యం చేయించారు. ఆ తర్వాత మూడు నెలల క్రితం రజిత ఓ పాపకు జన్మనిచ్చింది. అప్పటినుంచి ఆమె కొంత వింతగా ప్రవర్తిస్తోందని సమాచారం. ఆమె ప్రవర్తనతో విసిగిపోయిన మల్లేశ్ కుటుంబసభ్యులు వేధించడం ప్రారంభించారు. ఈ విషయం రజిత బాబాయ్ జమ్మికుంట మండలం శ్యాంపేట్‌కు చెందిన రవీందర్‌కు తెలియడంతో ఆయన దొంగల శ్యామ్ అనే భూత వైద్యుడిని ఆశ్రయించాడు. సదరు భూత వైద్యుడు మల్లేశ్ ఇంటికొచ్చి రజిత చేతబడులకు గురైందని, ఆమెతో పూజ చేయించి నయం చేస్తానని నమ్మబలికాడు. బాలింత అని కూడా చూడకుండా తల వెంట్రుకలు పట్టుకుని ఇష్టారీతిన కొట్టడంతో రజిత సొమ్మసిల్లి పడిపోయింది. దీంతో కంగుతిన్న కుటుంబసభ్యులు ఆమెను కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఇప్పుడామె కోమాలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై జైపూర్ ఏసీపీ భూపతి నరేందర్ ఆదేశంతో ఓ పోలీసు బృందం మల్లేశ్ ఇంటికి వెళ్లి విచారణ చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
దెయ్యం పట్టిందని బాలింతకు భూత వైద్యం
-
దెయ్యం పట్టిందని బాలింతకు చిత్రహింసలు...
సాక్షి, మంచిర్యాల: జిల్లాలో దారుణం జరిగింది. భూతవైద్యం ఓ మహిళ ప్రాణాల మీదికి తెచ్చింది. వైద్యం పేరుతో భూతవైద్యుడు మహిళకు నరకం చూపాడు. తల వెంట్రుకలు లాగుతూ కొట్టడంతో బాలింత మహిళ అపస్మారక స్థితికి చేరింది. పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వివరాల్లోకెళ్తే.. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కుందారంలో భూతవైద్యుడు పచ్చిబాలింత అయిన రజితకు నరకం చూపాడు. 4 నెలల క్రితం పాపకు జన్మనిచ్చిన రజిత అప్పటినుంచి అనారోగ్యంగా ఉండటంతో దయ్యం పట్టిందని కుటుంబ సభ్యులు భూతవైద్యుడిని ఆశ్రయించారు. రజిత మేనమామ భూత వైద్యుడిని తీసుకొని కుందారంలోని రజిత అత్తవారింటికి వెళ్ళి వైద్యం చేయించారు. అక్కడ దెయ్యం వదిలిందా అంటూ రజిత కుటుంబ సభ్యుల ముందే నరకం చూపాడు. ఏదో చెబుతూ మంచంపై పడేశాడు. భూతవైద్యుడు కొట్టిన దెబ్బలకు చిత్రహింసలకు తాళలేక రజిత అపస్మారక స్థితికి చేరింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. రజితది కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాక కాగా, ఏడాది క్రితం కుందారంకు చెందిన మల్లేశంతో ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లయిన కొద్ది రోజులకు అనారోగ్యం పాలు కావడంతో దెయ్యం పట్టిందని భూతవైద్యుడుతో వైద్యం చేయించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా, ఇంకా మూఢనమ్మకాలతో భూత వైద్యులను ఆశ్రయించి ప్రాణాలమీదికి తెచ్చుకోవడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. భూత వైద్యుల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు. -
దెయ్యం వదిలిస్తానని... అత్యాచారం చేశాడు
భివండీ, న్యూస్‌లైన్: కూతురికి పట్టిన దెయ్యాన్ని వదిలిస్తానని, తల్లిపై అత్యాచారం చేసిన భూత వైధ్యుడిని గణేష్‌పురి పోలీసులు బుధవారం రాత్రి అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం... గణేష్‌పురి ప్రాంతంలో నివాసముంటున్న ప్రభాకర్ పాటిల్ (50) భూత వైధ్యుడు. అదే ప్రాంతానికి చెందిన ఓ వివాహిత నవంబర్ నెలలో ప్రభాకర్ ఇంట్లో పని మనిషిగా చేరింది. ఆమెకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆమె కుమారునికి ఫిట్స్ వ్యాధి ఉందని బాధ పడుతున్న ఆమెను, ‘‘నీ కూతురికి భూతం పట్టింది, దాని నుంచి విముక్తి కలిగిస్తాను. అమావాస్య రోజు రాత్రి తీసుకురమ్మ’’ని చెప్పాడు. వైద్యం చేయించడానికి డ బ్బు లేని ఆ పేదరాలు తన కూతురిని తీసుకుని పోయింది. బాలిక నిద్రపోగా, తల్లి కాళ్లు, చేతులు కట్టేసి మంత్రాలు చదివినట్లుగా నటిస్తూ ఆమెపై అత్యాచారం చేశాడని బాధితురాలు చెప్పింది. ఆ తరువాత ఇలా ఏదో వంకతో ఇంటికి రప్పించుకుని కొద్ది రోజులుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడని బాధితురాలు స్థానిక గణేష్‌పురి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో అతడిని అరెస్టు చేసి కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు.