Inter First Year Student Murdered In Tadepalli Rural, యువకుడి ప్రాణం తీసిన వాట్సప్‌ స్టేటస్‌! - Sakshi
Sakshi News home page

యువకుడి ప్రాణం తీసిన వాట్సప్‌ స్టేటస్‌!

Feb 1 2021 4:56 AM | Updated on Feb 1 2021 5:09 PM

Young Man Died In Suspicious Condition At Tadepalli Rural - Sakshi

సాయి (ఫైల్‌ ఫొటో)

సాక్షి, తాడేపల్లి రూరల్‌: ఓ విద్యార్థి తన వాట్సప్‌ స్టేటస్‌లో తన మిత్రుడి ప్రేయసి ఫొటోను పోస్టు చేసి.. ఐ లవ్‌ యూ అని రాయడం వివాదానికి దారితీసి ఆ విద్యార్థి ప్రాణాన్ని బలిగొంది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన గురవయ్య, శివకుమారి దంపతుల ఏకైక కుమారుడు వెంపటి సాయి విజయవాడలోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతున్నాడు. ఈ క్రమంలో ఉండవల్లి సెంటర్‌లో కొందరు విద్యార్థులు సాయికి పరిచయమయ్యారు. వారిలో ఒకరైన ఐటీఐ విద్యార్థి తన ఇంటికి సమీపంలోని ఓ యువతిని ప్రేమిస్తున్నాడు.

ఆ యువతి ఫొటోను వెంపటి సాయి తన స్టేటస్‌లో పెట్టి.. ఐ లవ్‌ యు అని రాయడాన్ని ఐటీఐ విద్యార్థి చూశాడు. వెంటనే సాయిని ఉండవల్లి సెంటర్‌కి పిలిపించి మరో ముగ్గురితో కలిసి దాడికి పాల్పడ్డాడు. అనంతరం సాయి కనిపించకుండా పోవడంతో అతని తల్లిదండ్రులు తాడేపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దాడికి పాల్పడిన విద్యార్థుల్ని విచారిస్తుండగా.. సాయి వడ్డేశ్వరం వద్ద బకింగ్‌హామ్‌ కెనాల్‌లో శవమై కనిపించాడు. సాయిని అతని స్నేహితులు చంపి కాలువలో పడేశారని మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement