
మెదక్, మనోహరాబాద్(తూప్రాన్): కోడి గుడ్డు కూర వండలేదని యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాజుగౌడ్ వివరాల మేరకు.. మండలంలోని రంగాయపల్లి గ్రామానికి చెందిన మస్కూరి నర్సింలు, సుశీల దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు మాములేశ్ (19) ఎనిమిది నెలల క్రితం బైక్ ప్రమాదంలో చెయ్యి విరిగి ఇంటి వద్ద ఉంటున్నాడు.
ఎలాంటి పని చేయడం లేదు. మంగళవారం రాత్రి ఇంట్లో కోడి గుడ్డు కూర వండమని తల్లిని అడిగితే ఇంత రాత్రి ఎలా వండాలని అని మందలించింది. దీంతో ఇంట్లో గొడవపడి మాములేష్ బయటకు వెళ్లిపోయాడు. తల్లి సుశీల చుట్టుపక్కల వెతికినా కనిపించలేదు. బుధవారం ఉదయం గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకొని కనిపించాడు. తండ్రి నర్సింలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment