శవమై తేలిన ధర్మతేజ | Telangana: Young Man Body Found In Godavari River - Sakshi
Sakshi News home page

శవమై తేలిన ధర్మతేజ

Published Wed, Oct 11 2023 7:56 AM

- - Sakshi

కరీంనగర్: ఎన్టీపీసీకి చెందిన పలువురు యువకులు ఈనెల 8వ తేదీన బర్త్‌ డే పార్టీ చేసుకునేందుకు ఎల్లంపల్లి ప్రాజెక్టు వచ్చారు. కేక్‌ కట్‌ చేసి విందు ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఐదుగురు మిత్రులు గోదావరినదిలో స్నానానికి దిగారు. ఈక్రమంలో కనకమేడల ధర్మతేజ(32) నీటిలో గల్లంతైన విషయం తెలిసిందే. 48 గంటల పాటు గోదావరినదిలో జాలర్లతో గాలింపు చర్యలు చేపట్టగా మంగళవారం మృతదేహం లభించింది.

మృతదేహానికి అక్కడే పోస్టుమార్టం నిర్వహించి మృతుడి బంధువులకు అప్పగించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్నట్లు అంతర్గాం ఎస్సై బోగె సంతోష్‌కుమార్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement