
మనిషి జీవితం ఎంత విచిత్రమైందో ఇప్పటికే పలు సందర్భాల్లో చూశాము. డ్యాన్స్ చేస్తూ, కుటుంబ సభ్యులతో హ్యాపీగా గడుపుతూ సెకన్ల వ్యవధితో ప్రాణాలు కోల్పోయిన వీడియోలు ఎంతో ఆవేదనకు గురిచేశాయి. తాజాగా అలాంటి మరో ఘటనే ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. యూపీలోని కిద్వాయినగర్‌కు చెందిన జుబేర్(18) స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో వారితో కలిసి వీధుల్లో తిరుగుతూ ఫ్రెండ్స్‌తో ముచ్చటిస్తున్నాడు. ఈ క్రమంలో కొంత దూరం వారితో కలిసి నడిచిన తర్వాత జుబేర్ తుమ్ముతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. జుబేర్ కింద పడిపోతున్న సమయంలో తోటి ఫ్రెండ్స్ అతడిని పట్టుకునే ప్రయత్నం చేశారు.
అనంతరం, అతడి స్నేహితులు సహాయం కోసం కేకలు వేశారు. దీంతో, ఇళ్లలో నుంచి బయటకు వచ్చిన స్థానికులు జుబేర్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, జుబేర్‌ను పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే మరణించినట్టు తెలిపారు. దీంతో, ఒక్కసారిగా జుబేర్ కుటుంబ సభ్యులు, అతడి స్నేహితులు కన్నీటిపర్యంతమయ్యారు. అప్పటి వరకు తమతో జాలీగా ఉన్న స్నేహితుడు సెకన్ల వ్యవధిలో చనిపోవడంతో వారు బాధను తట్టుకోలేకపోయారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
जिंदगी न कोई ठिकाना.........रास्ते चलते अचानक छींक आई, लड़के ने अपना गला पकड़ा और उसकी मौत हो गई. pic.twitter.com/PVtWXfZxKH— Shubham shukla (@ShubhamShuklaMP) December 4, 2022