సాక్షి, హన్మకొండ: కాకతీయ యూనివర్సిటిలో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యూనివర్సిటీలో ఇవాళ జరగాల్సిన తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల సంఘర్షణ సభ వాయిదా పడింది. సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో విద్యార్థులు, నిరుద్యోగులు మహాధర్నాకు దిగారు. వీసీ ఛాంబర్‌లోకి దూసుకెళ్లడంతో పాటు అడ్మినిస్ట్రేషన్ భవనం ఎదుట ధర్నాకు దిగారు.
మరోవైపు సభకు వర్సిటీ అధికారులు సైతం అనుమతి ఇవ్వకపోవడంతో.. హైకోర్టులోనే ఈ అంశంపై తేల్చుకుంటామని కేయూ జేఏసీ నేతలు చెప్తున్నారు. సభ అర్థాంతరంగా రద్దు కావడంతో కాకతీయ యునివర్సిటీ లైబ్రరీ వద్ద మహా ధర్నాకు దిగారు.
ఈ క్రమంలో.. భారీగా విద్యార్థులు, నిరుద్యోగులు, గ్రూప్ వన్ అభ్యర్థులు తరలివస్తుండగా.. అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. గేటు ముందు టైర్లు అంటించేందుకు కొందరు విద్యార్థులు ప్రయత్నించగా.. పోలీసులు వాళ్లను అడ్డుకున్నారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment