kakthiya university
-
కేయూలో ఉద్రిక్త వాతావరణం
సాక్షి, హన్మకొండ: కాకతీయ యూనివర్సిటిలో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యూనివర్సిటీలో ఇవాళ జరగాల్సిన తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల సంఘర్షణ సభ వాయిదా పడింది. సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో విద్యార్థులు, నిరుద్యోగులు మహాధర్నాకు దిగారు. వీసీ ఛాంబర్లోకి దూసుకెళ్లడంతో పాటు అడ్మినిస్ట్రేషన్ భవనం ఎదుట ధర్నాకు దిగారు. మరోవైపు సభకు వర్సిటీ అధికారులు సైతం అనుమతి ఇవ్వకపోవడంతో.. హైకోర్టులోనే ఈ అంశంపై తేల్చుకుంటామని కేయూ జేఏసీ నేతలు చెప్తున్నారు. సభ అర్థాంతరంగా రద్దు కావడంతో కాకతీయ యునివర్సిటీ లైబ్రరీ వద్ద మహా ధర్నాకు దిగారు. ఈ క్రమంలో.. భారీగా విద్యార్థులు, నిరుద్యోగులు, గ్రూప్ వన్ అభ్యర్థులు తరలివస్తుండగా.. అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. గేటు ముందు టైర్లు అంటించేందుకు కొందరు విద్యార్థులు ప్రయత్నించగా.. పోలీసులు వాళ్లను అడ్డుకున్నారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. -
పుష్కరాలు ముగిశాయ్.. పరీక్షలెన్నడు?
దూరవిద్య పరీక్షల షెడ్యూల్ ప్రకటించ నిఅధికారులు పరీక్ష కేంద్రాల ఏర్పాటుపై ఇంకా కొనసాగుతున్న కసరత్తు కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్య కేంద్రం డిగ్రీ, పీజీ పరీక్షల షెడ్యూల్ వెల్లడించకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. డిగ్రీ, పీజీ పరీక్షలను ఈనెల 17వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు తొలుత వెల్లడించినా కృష్ణ పుష్కరాల పేరిట వాయిదా వేస్తున్నట్లు 15వ తేదీన వెల్లడించారు. అయితే, పుష్కరాలు ముగిసినా ఇంకా రీ షెడ్యూల్ వెల్లడించకపోవడం గమనార్హం. కేంద్రాలు వద్దన్న యాజమాన్యాలు కేయూ ఎస్డీఎల్సీఈ డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణ కోసం అధికారులు పలు కళాశాలల్లో కేంద్రాలు ఏర్పాటుచేశారు. అయితే, కొన్ని కేంద్రాల యాజమాన్యాలు తమ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలు వద్దని అధికారులకు తెలియజేశారు. మరికొందరు ఎంవోయూ స్టడీసెంటర్ల యాజమాన్యాలు మాత్రం పరీక్ష కేంద్రాలు కావాలని అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇలా పలు కారణాలతో పరీక్ష కేంద్రాల ఏర్పాటుపై ఇంకా కసరత్తు సాగుతూనే ఉంది. గతంలో ప్రకటించిన పరీక్షా కేంద్రాల్లో కొన్నింటిని తొలగించడం, కొత్త కళాశాలల్లో ఏర్పాటుచేయడం కోసం అధికారులు అన్వేషణలో ఉన్నారు. ఇక మరోవైపు అబ్జర్వర్ల డ్యూటీల కోసం కొందరు పట్టుపడుతున్నారు. పార్ట్‌టైం, కాంట్రాక్చువల్ లñ క్చరర్లు, పరిశోధకులు, పీడీఎఫ్ అభ్యర్థులు అధికారుల చుట్టూ తిరుగుతుండగా.. డ్యూటీలను ఏ ప్రాతిపదికన వేయాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నారు. ఈ విషయమై విధివిధానాలను రూపొందించేందుకు ముగ్గురు ప్రొఫెసర్లతో కమిటీ ఏర్పాటుచేయగా వారు ఓ నివేదిక రూపొందించారు. దూరవిద్య డిగ్రీ పరీక్షలు 42వేల మందికి పైగా, పీజీ పరీక్షలను 9వేల మందికి పైగా అభ్యర్థులు రాయనుండగా 90 వరకు పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. అలాగే, 110 మంది అబ్జర్వర్ల అవసరమని తెలుస్తోంది. అయితే, ఇంతకంటే ఎక్కువ సంఖ్యలో పోటీ పడుతుండగా.. కమిటీ నివేదిక ప్రతిపాదనికన డ్యూటీలు కేటాయించాలని భావిస్తున్నారు. ఇదంతా త్వరగా పూర్తిచేసి పరీక్షల రీ షెడ్యూల్ వెల్లడించాలని అభ్యర్థులు కోరుతున్నారు. -
కేయూలో ఆమరణ దీక్షలు షురూ
కేయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : కాకతీయ యూనివర్సిటీలో ప్రైవేట్ మెస్‌లను రద్దు చేయాలనే డిమాండ్‌తో వివిధ సంఘాల విద్యార్థు లు ఆదివారం ఆమరణ దీక్షకు దిగారు. క్యాంపస్‌లో పరి పాలన భవనం ఎదుట సాయంత్రం ఐదు గంటలకు దీ క్షలు ప్రారంభమయ్యాయి. మెస్‌ల ప్రైవేటీకరణను నిరసిస్తూ యూనివర్సిటీ పరిరక్షణ సమితిగా ఏర్పడిన వి ద్యార్థి సంఘాలబాధ్యులు 19రోజులుగా దీక్షలు చేస్తున్న విషయం విదితమే. అయినప్పటికీ అధికారులు వెనక్కి తగ్గకపోవడంతో విద్యార్థులు ఆమరణ దీక్షకు దిగారు. నిర్ణయం విరమించుకునే వరకు... ఆమరణ దీక్ష శిబిరంలో చలమల వీరన్న(పీడీఎస్ యూ), ఎ.యాకయ్య(కుర్సా), లక్ష్మణ్(ఎన్ఎస్యూ ఐ), నరహరి(ఎస్ఎస్ఎఫ్), రామారావు(టీఎస్ఎఫ్), ఆంగోతు వినోద్‌నాయక్(ఇంజనీరింగ్ విద్యార్థి) కూర్చున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారులకు ఎన్నిమార్లు విన్నవించినా స్పందన రాకపోవడంతో ఆమరణ దీక్షకు దిగామని తెలిపారు. ప్రైవేట్ మెస్‌లు రద్దు చేసే వరకు దీక్ష కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కాగా, మెస్‌ల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ విద్యార్థులతో పాటు నలుగురు ప్రొఫెసర్లు గవర్నర్ నరసింహన్, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహతో పాటు పలువురు మంత్రులను కలిశారు. అయినా అధికారులు పట్టువీడకపోవడంతో చివరగా ఆమరణ దీక్షకు దిగారు. నాణ్యమైన భోజనం అందడం లేదని చెబుతూ విద్యార్థులు ప్రైవేటు మెస్‌ల రద్దుకు పట్టుబట్టగా, దుబారా తగ్గినందున ప్రైవేట్ మెస్లనే కొనసాగిస్తామని అధికారులు స్పష్టం చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో శనివారం సీఎం, డిప్యూటీ సీఎంను నలుగురు విద్యార్థులు, నలుగురు ప్రొఫెసర్లు కలిసి రాగా, ఆదివారం ఉదయం చేపట్టిన నిరాహార దీక్షల ముగింపు అనంతరం సాయంత్రం ఐదు గంటలకు విద్యార్థి సంఘాలు నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమరణ దీక్షలు చేయాలని నిర్ణయించి ఆరుగురు విద్యార్థులు కూర్చున్నారు. కాగా, యూనివర్సిటీ పరిరక్షణ సమితిలో కొనసాగుతున్న ఎస్ఎఫ్ఐ బాధ్యులు ఆమరణ దీక్షల నుంచి మాత్రం విరమించుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కేయూ ఇన్చార్జ్ కె.వీరన్న ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడిచినందున విద్యార్థులు తరగతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. మెస్‌ల విషయమై సీఎం, డిప్యూటీ సీఎం పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆందోళన నుంచి విరమించుకుంటున్నట్లు తెలిపారు.