
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ చీరలు పంపిణీ చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి చీరలు పంపిణీ చేయాలా లేక కోవిడ్ నిబంధనలు పాటిస్తూ గ్రామ, వార్డు కేంద్రాల్లో పంపిణీ చేయాలా అనే నిర్ణయాన్ని కలెక్టర్లకు అప్పగిస్తున్నట్లు టెస్కో ఎండీ శైలజా రామయ్యర్ వెల్లడించారు. బతుకమ్మ చీరలు ఇప్పటికే జిల్లాల్లోని గోదాములకు సరఫరా కాగా, అక్టోబర్ 2వ తేదీ నుంచి గ్రామ/ వార్డు కమిటీ ద్వారా పంపిణీ ప్రారంభించాలని నిర్ణయించారు.
గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శి లేదా సంబంధిత ప్రభుత్వ అధికారి, గ్రామ మహిళా సంఘం ప్రతినిధి, రేషన్ డీలర్ సభ్యులుగా ఉండే కమిటీ పర్యవేక్షణలో చీరల పంపిణీ జరుగుతుంది. మున్సిపల్ వార్డు స్థాయిలో బిల్ కలెక్టర్, వార్డు మహిళా సంఘం ప్రతినిధి, రేషన్ డీలరు సభ్యులుగా ఉండే కమిటీ చీరలు పంపిణీ చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment