Sarees Distributions
-
ఎన్నికల ప్రచారంతో చీరల వ్యాపారానికి పెరిగిన డిమాండ్!!
3D-print saree business in Gujarat: యూపీ ఎన్నికలతో గుజరాత్లో త్రీడీ ప్రింట్ చీరల వ్యాపారం ఊపందుకుంది. ఎన్నికలు జరగన్నును రాష్ట్రాలలో కోవిడ్ -19 దృష్ట్య బహిరంగ ఎన్నికల ప్రచారాన్ని ఎన్నికల కమిషన్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఉత్తరప్రదేశ్‌లోని ఎన్నికల ప్రచారం కాస్త గుజరాత్‌లోని సూరత్‌లో చీరల వ్యాపారానికి ఊతం ఇచ్చింది. ఈ మేరకు సూరత్‌లోని టెక్స్టైల్ మార్కెట్‌కు చెందిన ఒక బట్టల వ్యాపారి ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముఖాల త్రీడి ప్రింట్లతో చీరను తయారు చేశాడు. దీనికి బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారుల మద్దతు ఉంది. పైగా వారి డిమాండ్ మేరకు సూరత్ వ్యాపారులు ఈ చీరలను తయారు చేస్తున్నారు. అంతేకాదు ఈ చీరలపై రామమందిరం, వారణాసిలోని వివిధ ఘాట్లు, ఇటీవల ప్రధాని ప్రారంభించిన కాశీ విశ్వనాథ్ కారిడార్ల ప్రింట్లను ముద్రించారు. పైగా ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ చీరలను పెద్దమొత్తంలో పంపించాలని సూరత్‌కు చెందిన వ్యాపారులు ప్లాన్ చేస్తున్నారు. ఈ కొనుగోళ్లు కూడా బీజేపీ మద్దతుదారులే చేస్తారు. ఉత్తరప్రదేశ్‌లో తమ ఎన్నికల ప్రచారానికి సహకరించే మహిళలకు ఈ చీరలను పంపిణీ చేయాలని వారు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ చీరల్లో కొన్నింటిపై బీజేపీ ఎన్నికల గుర్తు కమలం చిత్రం కూడా ఉంటుంది. అంతేకాదు ఉత్తరప్రదేశ్ ఎన్నికల కోసం సుమారు లక్ష చీరలను పంపనున్నట్లు వస్త్ర వ్యాపారి లలిత్ శర్మ తెలిపారు. (చదవండి: ఎంత బిజీగా ఉన్నా ఆ పని చేయిస్తా: ప్రియాంక గాంధీ) -
కబురు చేస్తే చాలు.. పేదింటి పెళ్లికి పెద్దకొడుకు
సాక్షి, సిరిసిల్ల(కరీంనగర్): జిల్లా కేంద్రంలోని పద్మనగర్‌కు చెందిన నాయుడు రమ (భర్త శ్రీధర్ చనిపోయారు) కూతురు వసంతకు శుక్రవారం వివాహం నిశ్చయమయ్యింది. అలాగే తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్కులో ఉండే గాజుల లలిత కూతురు కీర్తి పెళ్లి కూడా ఇదే రోజున ఖాయమైంది. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్న వీరు పేదరికం కారణంగా తెలిసిన వాళ్లు ఇచ్చిన సమాచారం మేరకు పట్టణంలోని శ్రీనివాస్ చారిటబుల్ ట్రస్టు నిర్వాహకుడు లగిశెట్టి శ్రీనివాస్‌ను సంప్రదించారు. వెంటనే స్పందించిన ఆయన పెళ్లికి అవసరమైన పుస్తె మెట్టెలు, పెండ్లి చీర, గాజులను అందజేసి పేదింటి పెళ్లికి పెద్ద కొడుకు అవుతున్నాడు. ..ఇలా ప్రయోజనం పొందింది కేవలం వసంత, లలిత మాత్రమే కాదు. జిల్లా వ్యాప్తంగా నిరుపేద కార్మిక, కర్షక కుటుంబాలకు చెందిన ఎంతోమంది ఆడపిల్లలు కల్యాణ సాయం కింద పుస్తె, మెట్టెలను అందుకున్నారు. ఇప్పటి వరకు దాదాపు 200కు పైగా నిరుపేద కుటుంబాలు ప్రయోజనం పొందాయి. ఆర్థికంగా చితికిపోయిన ఆడపిల్లల పెళ్లిళ్లకు తక్షణ సాయంగా పుస్తెమెట్టెలను అందిస్తూ సిరిసిల్లకు చెందిన లగిశెట్టి శ్రీనివాస్ తన దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. నేపథ్యం.. ప్రస్తుతం పట్టణంలో వస్త్ర వ్యాపారం చేసే లగిశెట్టి విశ్వనాథం, దేవేంద్రమ్మ దంపతుల కుమారుడు శ్రీనివాస్. 1971 మార్చి 5న జన్మించిన శ్రీనివాస్ తన తండ్రి నుంచి వారసత్వంగా అందివచ్చిన వ్యాపారాన్ని నిర్వహిస్తూ కాలానుగుణ మార్పులతో పారిశ్రామిక రంగంలో స్థిరపడ్డారు. ముతక రకం నూలు వస్త్రం తయారయ్యే కాలంలో ఆధునికంగా ఆలోచించి క్లాత్ ప్రాసెసింగ్ రంగాన్ని పరిచయం చేశారు. రాజకీయ రంగంలోనూ తన ఉనికి చాటుకున్నారు. అధికార పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూనే సహకార విద్యుత్ సరఫరా సంఘం ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. శ్రీనివాస్ చారిటబుల్ ట్రస్టు ద్వారా.. తన ఉన్నతికి కారణమైన పట్టణంలోని ప్రజానీకానికి తన వంతుగా సేవలు అందించాలని సంకల్పించి 2011లో తన పేరిట చారిటబుల్ ట్రస్టును స్థాపించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ట్రస్టు ద్వారా సమాజ సేవలను అందిస్తున్నాడు. విద్యార్థులకు నోట్ బుక్కులు, పుస్తకాలు, వృద్ధాప్యంలో ఉన్నవారికి దుప్పట్లు ఏటా వితరణ చేసే ఆయన తంగళ్లపల్లి మండలం పద్మనగర్‌లోని తన సొంత స్థలంలో సంతోషిమాత దేవాలయాన్ని నిర్మించారు. ఆలయానికి పరిసరాల్లో వృద్ధాశ్రమాన్ని కూడా స్థాపించారు. అవసాన దశలో అయినవాళ్ల నిరాదరణకు గురైన పేద వృద్ధులకు ఆశ్రయం కల్పించాడు. సుమారు 20మందికి పైగా వృద్ధులు ప్రస్తుతం వృద్ధాశ్రమంలో తల దాచుకుంటున్నారు. జన్మభూమి కోసం.. పుట్టి పెరిగిన ప్రాంతానికి సేవ చేయడం ప్రతి మనిషి కనీస కర్తవ్యం. ఇక్కడి ప్రజల ఆశీస్సులతో ఎదిగిన నేను నా వంతుగా సమాజానికి సేవలు అందించాలనుకున్నాను. ఆపన్నులకు అండగా ఉండేందుకు చారిటబుల్ ట్రస్టును స్థాపించా. వృద్ధాశ్రమ నిర్వహణతో పాటు పేదల పెళ్లిళ్లకు సహాయపడటం సంతృప్తి నిస్తోంది. పేదరికం పెద్ద చదువులకు ఆటంకం కావద్దని ప్రతిభావంతులైన విద్యార్థులకు సహకరిస్తున్నా. ఇదంతా సంతోషిమాతా దేవితో పాటు తల్లిదండ్రుల ఆశీర్వాదంగా భావిస్తున్నా. – లగిశెట్టి శ్రీనివాస్, ట్రస్టు నిర్వాహకుడు చదవండి: అమ్మకానికి పెట్టి బుక్కయ్యాడు.. వాడి ప్రతిభకు పోలీసులే అవాక్కు! -
తీరొక్క పూల పండుగ.. బతుకమ్మ
సాక్షి, హైదరాబాద్: ఆనందోత్సాహాల నడుమ రంగు రంగుల పూలతో మహిళలంతా కలిపి జరుపుకునే పండుగ బతుకమ్మ అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. రాజ్‌భవన్‌లోని మహిళా ఉద్యోగులకు ఆదివారం ఆమె చీరెలను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. బతుకమ్మ జరుపుకునేందుకు ప్రకృతి ప్రసాదించిన రకరకాల పూలను వాడుతారని చెప్పారు. నిమజ్జనం తర్వాత ఈ పూలలో ఉన్న ఔషధ గుణాల కారణంగా చెరువుల్లో, నదుల్లోని నీరు స్వచ్ఛంగా మారుతుందన్నారు. ప్రజలంతా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, భక్తిశ్రద్ధలతో బతుకమ్మ జరుపుకోవాలని సూచించారు. బతుకమ్మ పండుగ సమయంలో గత రెండేళ్లు రాజ్‌భవన్‌లో మహిళా ఉద్యోగులకు గవర్నర్ చీరెలు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు. -
బతుకమ్మ చీరల పంపిణీ బాధ్యత కలెక్టర్లకు
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ చీరలు పంపిణీ చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి చీరలు పంపిణీ చేయాలా లేక కోవిడ్ నిబంధనలు పాటిస్తూ గ్రామ, వార్డు కేంద్రాల్లో పంపిణీ చేయాలా అనే నిర్ణయాన్ని కలెక్టర్లకు అప్పగిస్తున్నట్లు టెస్కో ఎండీ శైలజా రామయ్యర్ వెల్లడించారు. బతుకమ్మ చీరలు ఇప్పటికే జిల్లాల్లోని గోదాములకు సరఫరా కాగా, అక్టోబర్ 2వ తేదీ నుంచి గ్రామ/ వార్డు కమిటీ ద్వారా పంపిణీ ప్రారంభించాలని నిర్ణయించారు. గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శి లేదా సంబంధిత ప్రభుత్వ అధికారి, గ్రామ మహిళా సంఘం ప్రతినిధి, రేషన్ డీలర్ సభ్యులుగా ఉండే కమిటీ పర్యవేక్షణలో చీరల పంపిణీ జరుగుతుంది. మున్సిపల్ వార్డు స్థాయిలో బిల్ కలెక్టర్, వార్డు మహిళా సంఘం ప్రతినిధి, రేషన్ డీలరు సభ్యులుగా ఉండే కమిటీ చీరలు పంపిణీ చేస్తుంది. -
బతుకమ్మ చీరల పంపిణీ సందడి
-
టీడీపీ ప్రలోభాలు..ఓటర్లకు చీరల పంపిణీ
-
చీరలు ఇస్తామంటూ రప్పించి.. ఉసూరుమనిపించారు
గుంటూరు, దాచేపల్లి: పసుపు కుంకుమ చీరలు ఇస్తామని టీడీపీ నేతలు మహిళలను రప్పించి తీరా ఉసూరుమనిపించారు. నడికుడి పంచాయితీ పరిధిలోని నారాయణపురం బ్రహ్మనాయుడు ఆడిటోరియంలో సోమవారం జరిగిన పసుపు కుంకుమ చీరల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పంపిణీ చేసే చీరల కోసం మహిళలందరూ గుంపుగా రావటంతో తొక్కిసలాట జరిగి పలువురు మహిళలకు గాయాలు కాగా మరికొందరు నగలు, నగదు పోగొట్టుకున్నారు. మహిళలను అదుపు చేయలేక టీడీపీ నాయకులు చేతులెత్తేశారు. చీరలు పంపిణీ చేయలేక ఆటోల్లో తరలిస్తుండగా వాటిని చూసిన మహిళలు స్లిప్‌లు తీసుకుని ఇవ్వాలని కోరినా టీడీపీ నాయకులు పట్టించుకోకుండా ఇప్పుడు ఇచ్చేది లేదంటూ వెళ్లిపోవడానికి ఉపక్రమించారు. దీంతో మహిళలు ఒక్కసారిగా ఆటోవైపు పరుగులు తీశారు. సభలో చీరలు ఇస్తారనే ఆశతో కూలి పనులు మానుకొని వచ్చిన మహిళలకు చివరకు చీరలు ఇవ్వకుండానే ఇంటికి పంపించారు. టీడీపీ నాయకులు మీ ఇళ్ల వద్దకు వచ్చి చీరలు ఇస్తామని ప్రకటించటంతో సభకు వచ్చిన మహిళలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చీరలు, స్వీట్లు ఇస్తామని... బ్రహ్మనాయుడు ఆడిటోరియంలో జరిగిన పసుపు కుంకుమ చీరల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. సభ ప్రారంభానికి ముందు ఎమ్మెల్యే ప్రసంగించిన తరువాత చీరలు, స్వీట్లు పంపిణీ చేస్తామని టీడీపీ నాయకులు ప్రకటించారు. ఎమ్మెల్యే ప్రసంగం ముగిసిన తరువాత కొంతమంది మహిళలకు మాత్రమే చీరలు ఇచ్చారు. ఆ తరువాత చీరలు తీసుకునేందుకు టీడీపీ నాయకులు ఇచ్చిన స్లిప్‌లను తీసుకుని కౌంటర్ల వద్దకు వెళ్లారు. సభలో పాల్గొన్న మహిళందరూ ఒకేసారి కౌంటర్ల వద్దకు రావటంతో చీరలు తీసుకునేందుకు పోటీపడ్డారు. కౌంటర్ వద్ద రద్దీ పెరిగి తొక్కిసలాట జరిగింది. కొందరు మహిళలకు గాయాలయ్యాయి. తొక్కిసలాట లో ఊపిరి ఆడక పలువురు ఇబ్బందులు పడ్డారు. చీరల కౌంటర్ వద్దకు వచ్చిన వృద్ధులు కిందపడ్డారు. కొంతమంది మహిళలు నగదు, బంగారం పొగొట్టుకున్నారు. కొంతమంది మహిళలకు మాత్రమే చీరలు ఇచ్చారు. మహిళలను తరలించిన ఐకేపీ, మండల సమాఖ్య సభ్యులు, వీవోలు పసుపు, కుంకుమ సభకు మండలంలోని డ్వాక్రా మహిళలను తరలించేందుకు ఐకేíపీ, మండల సమాఖ్య సభ్యులు, వీవోలు కీలక ప్రాత పోషించారు. ఈ సభలో పాల్గొంటేనే రుణాలు వస్తాయని, లేదంటే ఇబ్బందులు పడతారని డ్వాక్రా మహిళలను పరోక్షంగా బెదిరించారు. సభకు వచ్చిన వారికి చీరలు, స్వీట్లు కూడా ఇస్తారని చెప్పి స్లిప్‌లు పంపిణీ చేశారు. గ్రామాల్లోకి ఆటోలు పంపిస్తామని ఐకేపీ, టీడీపీ నాయకులు చెప్పినప్పటికి కొన్ని గ్రామాలకు ఆటోలు రాకపోవటంతో మహిళలు సొంత ఖర్చులతో సభకు వచ్చారు. తీరా సభ ముగిసిన తరువాత చీరలు పంపిణీ చేయకపోవటంతో నిరాశతో వెనుదిరిగారు. సభ నేపథ్యంలో నడికుడి రైల్వే స్టేషన్ రోడ్డు మూసివేయటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
జిల్లాకు చేరిన బతుకమ్మ చీరలు
ఆదిలాబాద్‌అర్బన్: బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ఆడపడుచులకు ప్రభుత్వం పంపిణీ చేయనున్న బతుకమ్మ చీరలు జిల్లాకు చేరాయి. తొమ్మిది రోజుల పాటు సందడి వాతావరణంలో జరిగే తీరొక్క పూల పండుగకు ఈ సారి ప్రభుత్వం ముందస్తుగానే ఆలోచన చేసింది. దసరా పండుగకు ముందే మహిళా లబ్ధిదారులకు ‘కానుక’ అందజేయనుంది. ప్రభుత్వ ఈ పథకానికి గతేడాది శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ప్రతి ఏడాది బతుకమ్మ చీరలను ప్రభుత్వం అందజేస్తోంది. అయితే తెల్లరేషన్ కార్డు కలిగిన కుటుంబాల్లోని 18 ఏళ్లు నిండిన మహిళలకు ఈ చీరలను పంపిణీ చేయనున్నారు. అయితే గతేడాది మాదిరి కాకుండా ఈ సారి రూ.300 నుంచి రూ.350 విలువైన బార్డర్ అంచుతో ఉన్న పాలిస్టర్ చీరలను పంపిణీ చేయనున్నారు. ఇందుకు జిల్లా వ్యాప్తంగా 18 మండలాల్లో ఎంత మంది మహిళలు ఉన్నారనే వివరాలను అధికారులు సేకరించారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి కూడా మహిళా లబ్ధిదారుల వివరాలు అందాయి. అయితే జిల్లాకు వచ్చిన చీరలను త్వరలో పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాకు 1.19 లక్షల చీరలు.. జిల్లాలోని 18 మండలాల పరిధిలో 2,37,867 మంది మహిళా లబ్ధిదారులు ఉన్నట్లు పౌర సరఫరాల శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సమన్వయంగా గుర్తించారు. అయితే పంపిణీ బాధ్యతను మాత్రం గ్రామీణాభివృద్ధి శాఖ చేపట్టింది. జిల్లాకు మొదటి విడతగా లక్షా 19 వేల చీరలు వచ్చాయి. జిల్లాకు వచ్చిన బతుకమ్మ చీరలను ఆయా మార్కెట్ యార్డుల్లోని గోదాముల్లో భద్రంగా ఉంచారు. జిల్లా కేంద్రంలో గల మార్కెట్ యార్డులో 38 వేల చీరలు అందుబాటులో ఉంచగా, ఇచ్చోడ మార్కెట్లో 48,480 చీరలు, నార్నూర్ మార్కెట్లో 20 వేలు, ఇంద్రవెల్లి మార్కెట్లో 28 వేల చీరలను భద్రపర్చినట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. లబ్ధిదారుల సంఖ్యకు అనుగుణంగా చీరలు రాకపోవడంతో రెండో విడత చీరలు సరఫరా చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. గోదాముల నుంచి గ్రామాలకు చీరలు సరపరా చేసి ఆయా గ్రామాల్లోనే మహిళలకు పంపిణీ చేయనున్నారు. అయితే ప్రభుత్వం రంజాన్, క్రిస్మస్ పండుగలను పురస్కరించుకొని మైనార్టీలకు, క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే తరహాలో హిందూ మహిళలకు సైతం చీరలు పంపిణీ చేయాలని వచ్చిన విజ్ఞప్తుల మేరకు బతుకమ్మ చీరల పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు సమాచారం. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పంపిణీ.. గతేడాది చీరల నాణ్యతపై ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే. అలాంటి వ్యతిరేకత ఈసారి రాకూడదని ప్రభుత్వం భావిస్తోంది. పంపిణీ సమయంలో కొత్త చీరలు నలిగిపోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది. అయితే ప్రతి ఏడాది బతుకమ్మ పండుగకు ప్రభుత్వం చీరలను పంపిణీ చేయనుండడంతో రాష్ట్రంలోని చేనేత కార్మిక కుటుంబాలకు చాలా వరకు ఉపాధి దొరకడంతో పాటు చేనేత వస్త్రాలపై ప్రజలకు కూడా అవగాహన వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే జిల్లాకు వచ్చిన చీరలను గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేపట్టనున్నారు. ఈ సారి మహిళా సంఘాలు, అంగన్వాడీ కార్యకర్తలు ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, రేషన్ డీలర్లు చీరలను పంపిణీ చేసే అవకాశాలున్నాయి. పంపిణీకి రెవెన్యూ, పోలీస్ అధికారులు సైతం సహకరించనున్నారు. కాగా, ఈ ఏడాది బతకుమ్మ సంబరాలు అక్టోబర్‌లో జరుగనున్నాయి. -
చీరలెలా ఉన్నాయి?
నల్లగొండ టూటౌన్ : జిల్లాకు బతుకమ్మ చీరలు వచ్చాయి. బతుకమ్మ పండుగ కానుక కింద జిల్లాలో ఈ ఏడాది 5.07 లక్షల చీరలు అవసరం ఉంటాయని జిల్లా యంత్రాంగం గుర్తించింది. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు కూడా పంపారు. ప్రస్తుతానికి జిల్లాకు 1.08 లక్షల చీరలు చేరాయి. మిగతావి త్వరలో రానున్నాయి. గత ఏడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకొని బతుకమ్మ చీరల తయారీలో నాణ్యత తీసుకుంది. వాటిపై మహిళలనుంచి ఫీడ్‌బ్యాక్‌ను తీసుకుంటోంది. అధికారులు జిల్లాలోని మున్సిపల్ పట్టణాల్లో ఎంపిక చేసిన చోట్ల చీరలను మహిళలకు చూపించి వారినుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. జిల్లాకు చేరిన 1.08 లక్షల చీరలు తెల్లరేషన్, అంత్యోదయ తదితర కార్డుదారులకు బతుకమ్మ కానుక కింద చీరలు అందించనున్నారు. జిల్లాకు 5.07 లక్షలకు గాను ఇప్పటికే 1.08 లక్షల చీరలు వచ్చాయి. నల్లగొండ రెవెన్యూ డివిజన్‌కు సంబంధించి తిప్పర్తి గోదాములో 90 వేల చీరలు భద్రపరిచారు. మరో 18 వేల చీరలను దేవరకొండ డివిజన్‌కు సంబంధించి కొండమల్లేపల్లి గోదాములో ఉంచారు. మిర్యాలగూడ డివిజన్ కోసం అక్కడి గోదాములో పెట్టనున్నారు. మరో 15 రోజుల్లో జిల్లాకు అవసరమైన చీరలు చేరనున్నట్లు తెలిసింది. ఒక్కో చీరను టెస్కో నుంచి రూ.280కి కొనుగోలు చేసి పంపిణీ చేస్తుంది. జేసీ నేతృత్వంలో కమిటీ జిల్లాలో మున్సిపల్ పట్టణాలతోపాటు గ్రామ పంచాయతీల్లో బతుకమ్మ చీరల పంపిణీకి జేసీ నారాయణరెడ్డి నేతృత్వంలో నోడల్ కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో జిల్లాస్థాయిలో జేసీ, చేనేత జౌళీశాఖ ఏడీ, మెప్మా పీడీ, హౌజింగ్ పీడీతోపాటు మరికొంత మంది అధికారులు ఉంటారు. అదే విధంగా డివిజన్ పరిధిలో ఆర్డీఓ నేతృత్వంలో, మండల స్థాయిలో ఎంపీడీఓ, గ్రామస్థాయిలో పంచాయతీ, వీఆర్వోల నేతృత్వంలో కమిటీలను ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ బతుకమ్మ చీరల పంపిణీ సాఫీగా సాగేలా కమిటీలు పర్యవేక్షణ చేయనున్నాయి. మహిళలనుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్న ప్రభుత్వం ... గత ఏడాది జరిగిన సంఘటలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. జిల్లాలోని మున్సిపాలిటీ పట్టణాల్లో కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసి బతుకమ్మ చీరలను మహిళలకు చూపించి వారినుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. ఒక్కో పట్టణంలో ఐదు పాయింట్లు ఏర్పాటు చేసి మహిళలు వ్యక్తం చేసిన వారి అభిప్రాయాలను నోట్ బుక్‌లో రాసుకుంటున్నారు. కొన్నిచోట్ల మహిళలు భిన్నాబిప్రాయాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఒక్కో చోటుకు ఐదు చీరలను పంపించగా.. అన్నీ ఒకే మోడల్‌గా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. పండుగకు ముందు చీరలు పంచుతాం మహిళలకు పంపిణీ చేయడానికి 1.08 లక్షల బతుకమ్మ చీరలు జిల్లాకు వచ్చాయి. మరో 15 రోజుల్లోగా అన్ని చీరలు గోదాముల్లోకి వచ్చాక మండలాలకు పంపిస్తాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చీరలపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నాం.. వారి అభిప్రాయాలను ప్రభుత్వానికి పంపిస్తాం. – జహీరొద్దీన్, చేనేత, జౌళీశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ -
1.08 కోట్ల బతుకమ్మ చీరలు
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్రంలోని పేద మహిళలకు చీరలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. పండుగ అక్టోబర్‌లో వస్తున్న నేపథ్యంలో ఆలోపే పంపిణీ జరగనుంది. తెల్ల రేషన్ కార్డున్న కుటుంబాల్లో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు చీరలు ఇవ్వనున్నారు. పౌర సరఫరాల శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో తెల్ల కార్డు ఉన్న కుటుంబాల్లో 1.08 కోట్ల మంది మహిళలు ఉన్నారు. వీరి వివరాలు సరి చూసుకుని చీరలు పంపిణీ చేయనున్నారు. పాలిస్టర్ చీర, జరీ అంచుతో ఉండే ఈ చీరలన్నీ ఈసారి రాష్ట్రంలోనే తయారవుతున్నాయి. ఒక్కో చీరకు రూ.280 చొప్పున ఖర్చవుతోంది. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ జీహెచ్ఎంసీ పర్యవేక్షిస్తోంది. బతుకమ్మ చీరల పంపిణీ, హరితహారం, కంటి వెలుగు, మైనారిటీ, చేనేత కార్మికుల సంక్షేమ కార్యక్రమాలు తదితరాలపై జిల్లాల కలెక్టర్లతో మంగళవారం జోషి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. చీరల పంపిణీకి ఏర్పాట్లు చేసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. కార్యక్రమం విజయవంతం చేసేందుకు గ్రామ, పట్టణ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. గతేడాదిలానే గ్రామాల వారీగా చీరల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని, జిల్లా స్థాయిలో ఓ గోదామును ఎంపిక చేసుకోవాలని ఆదేశించారు. చేనేత, సహాయక కార్మికులకు 60 కోట్లతో ‘నేతన్నకు చేయూత’పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 17,000 మంది నమోదు చేసుకున్నారని.. మిగతా కార్మికుల పేర్లు నమోదయ్యేలా చూడాలని ఆదేశించారు. పెద్ద ఎత్తున ‘చేనేత’చెక్కుల పంపిణీ చేనేత కార్మికులకు చెక్కుల పంపిణీ, అవగాహన కార్యక్రమాన్ని జిల్లా ప్రజాప్రతినిధులు, మంత్రుల సహకారంతో సెప్టెంబర్ చివరలో పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్లకు జోషి సూచించారు. జాతీయ రహదారుల భూ సేకరణను వేగవంతం చేయాలని, ఈ అంశంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ప్రధాన మంత్రి జనవికాస్ కార్యక్రమం కింద మైనారిటీ సంక్షేమ శాఖకు మంజూరైన హాస్టళ్ల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మసీదులు, చర్చ్‌ల నిర్మాణానికి రూ.240 కోట్లతో గ్రాంట్ ఇన్ ఎయిడ్‌కు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. వాతావరణం అనుకూలంగా ఉన్నందున నాలుగో విడత హరితహారం లక్ష్యాలను సెప్టెంబర్ నెలాఖరుకల్లా 100 శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. వచ్చే ఏడాది హరితహారం కోసం నర్సరీల ఏర్పాటు పనులు మొదలు పెట్టాలన్నారు. -
పైసాచికం
- టీడీపీ ప్రలోభాల బరితెగింపు - నియోజకవర్గానికి రూ.4 కోట్లు పంపిణీ - ఒక్కరోజులో రూ.50కోట్లకుపైగా మద్యం,డబ్బు ప్రవాహం - పనిలోపనిగా నకిలీ మద్యం, నగదు, చీరలు పంపకాలు సాక్షి,విశాఖపట్నం: ఓడిపోతామని నిర్దారణకు వచ్చేసిన టీడీపీ జిల్లా లో మంగళవారం అడ్డగోలుగా రెచ్చిపోయింది. ప్రలోభాలతో బరితెగించేసింది. డబ్బు,మద్యం పంపకాలతో పేట్రేగిపోయింది. ఓటర్లు ఎలాగూ తమవైపు లేరని తేటతెల్లమవడంతో నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థు లు కోట్లు కుమ్మరించేశారు. ఎలాగూ అనుకూల పవనాలు వీచవని ఖాయమవడంతో చివరి ప్రయత్నంగా డబ్బును మంచినీళ్లప్రాయంగా విసిరేసింది. ఒక్కరోజులోనే జిల్లా అంతటా రూ.50కోట్లకుపైగా పంపకాలు చేసింది. ఆదరణ లేక అగచాట్లు టీడీపీ డబ్బు,మద్యం,చీరలు,సైకిల్ వంటి రకరకాల ఎరలను ఆశ్రయించి ఒక్క మంగళవారం రాత్రి నియోజకవర్గానికి రూ.3 కోట్ల చొప్పున రహస్యంగా పంపకాలు జరిపింది. అనకాపల్లిలో పీలాగోవింద్కు విజయంపై ఆశలు లేకపోవడంతో ఇప్పటివరకు రూ.20కోట్లు ఖర్చుచేయగా, మంగళవారం రాత్రి రూ.3కోట్ల వరకు డబ్బు,మద్యం,చీరలు పంపిణీ చేశారు. పాయకరావుపేటలో వంగలపూడి అనితకు నియోజకవర్గంలో చుక్కెదురవడంతో క్యాడర్,ఓటర్లకు రూ.2.5కోట్ల విలువైన జాకెట్లు,పట్టీలు,నగదు,మద్యం పంచినట్లు సమాచారం. నర్సీపట్నంలో ఎదురీదుతున్న అయ్యన్నపాత్రుడు ఇప్పటివరకు రూ.5కోట్లకుపైగా ఖర్చుచేయగా, మంగళవారం రూ.3కోట్ల విలువైన మద్యం,సైకిళ్లు,చీరలు,క్రికెట్ కిట్లు పంపించారు. యలమంచిలి అభ్యర్థి రాత్రికిరాత్రే అనుచరులతో మద్యం,డబ్బు,పట్టీలు పంపకాలు చేయించారని పోలీసులకు ఫిర్యాదులు వెళ్లాయి. అరకులో సిట్టింగ్ ఎమ్మెల్యే సోమ ఓటుకు రూ.400, నాటుసారా, జీలుగుకళ్లు పంపిణీ చేయించారు. పాడేరులో బీజేపీ అభ్యర్థి లోకులగాంధీకూడా భారీగా మద్యం నిల్వలను పంచారు. ఇక్కడ పోలీసు నిఘా లేకపోవడంతో దాచిన సరుకంతా పంపిణీ చేశారు. మాడుగుల అభ్యర్థి రామానాయుడు ముక్కుపుడకలు, కులసంఘాలు, విద్యార్థులకు ఓటుకు రూ.500చొప్పున నేరుగా ఇంటింటికీ వెళ్లి అనుచరులద్వారా చేరవేయించినట్లు సమాచారం. చోడవరంలో రాజు(టీడీపీ) పరిస్థితి ఘోరంగా మారడంతో రాత్రి రూ.2కోట్లకుపైగా విలువైన మద్యం,నగదు కూడా పంపిణీ చేశారు. చీకటి పంపకాల్లో పనిలోపనిగా ఓటర్లకు నకిలీనోట్లు కూడా అందించి మోసం చేశారు. నేరుగా ఇళ్లకే పంపిణీ... గాజువాకలో పల్లా శ్రీనివాస్ ఓటుకు రూ.1000నుంచి రూ.1200చొప్పున పంచారు. డ్వాక్రామహిళలు,కులసంఘాలకూ రూ.5లక్షల చొప్పున చేరవేశారు. పెందుర్తిలో బండారు(టీడీపీ) వివిధ గ్రామాల్లో ఉంచిన రూ.2కోట్లకుపైగా విలువైన మద్యం,డబ్బును ఫోన్లద్వారా వివిధ చిరునామాలకు పంపించి ఓటర్లను తనవైపునకు తిప్పుకునే ప్రయత్నాలు తీవ్రం చేశారు. భీమిలిలో గంటా ఓటమి ఖాయమైపోవడంతో జిల్లాలో అందరికంటే ఎక్కువగా రూ.4కోట్లకుపైగా మద్యం,డబ్బు, చీరలు,క్రికెట్ కిట్లు శివారు ప్రాంతాల నుంచి అనుచరుల ద్వారా ఇళ్లకు తరలించారు. మరికొన్ని బుధవారం తెల్లవారుఝామునే పంపకాలకు సిద్ధంచేసినట్లు సమాచారం. విశాఖ తూర్పులో వెలగపూడి ఓటుకు వెయ్యి,మద్యంతో రూ.1.5కోట్ల వరకు పంపిణీకి తెరతీశారు. చివరకు పోలీసులకూ ఇందులో కొంత ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. విశాఖ ఉత్తరంలో బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్‌రాజు 70శాతం ప్రలోభాలు పూర్తిచేయగా, రూ.2.5కోట్లు విలువైన మద్యం,డబ్బు,పట్టీలు పంపిణీ చేయించారని సొంతపార్టీ నేతలే వివరించారు. దక్షిణంలో వాసుపల్లి బరితెగించి బియ్యంతోపాటు తీరప్రాంత గ్రామాల్లో మద్యం,ఓటుకు రూ.500చొప్పున వెదజల్లారు. పశ్చిమంలో గణబాబు ఓటమి ఖరారైపోవడంతో ఏదోలా ఒడ్డుకు చేరుకునేందుకు రూ.1.2 కోట్ల విలువైన బట్టల దుకాణం టోకెన్లు, మద్యాన్ని పారించేశారు. అన్ని నియోజకవర్గాల్లో సుమారుగా రూ.40కోట్ల కుపైగా ప్రలోభాల విశ్వరూపాన్ని టీడీపీ ప్రదర్శించింది.