
పశ్చిమగోదావరి, ఏలూరు (మెట్రో): కలెక్టర్‌గా సుదీర్ఘకాలం విధులు నిర్వహించి తనదైన శైలిలో జిల్లా ప్రజల్లో, అధికారుల్లో ముద్రవేసిన కలెక్టర్ కాటంనేని భాస్కర్ బదిలీ కానున్నట్లు తెలిసింది. నాలుగుసంవత్సరాలు పూర్తి చేసుకుని ఐదో సంవత్సరంలోకి కలెక్టర్ పాలన ప్రవేశించింది. ఈ నేపథ్యంలో ఎప్పటి నుండో కలెక్టర్ బదిలీ కానున్నారని ప్రచారం సాగినా ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. కలెక్టర్ భాస్కర్‌కు ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక బాధ్యతలు అప్పగించనున్నారని.. ఒకటి రెండు రోజుల్లో ఆయన బదిలీ అవుతారని విశ్వసనీయంగా తెలిసింది. ఆయన స్థానంలో పశ్చిమ కలెక్టర్‌గా ప్రస్తుతం విశాఖపట్నం కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్‌కుమార్‌ను నియమించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment