తూర్పుగోదావరి, కాకినాడ సిటీ: తుపానుకు సంబంధించి అవసరమైన అన్ని ముం దస్తు చర్యలూ తీసుకున్నామని, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ కార్తికేయ మిశ్రా అన్నారు. కలెక్టరేట్‌లో ఏ ర్పాటు చేసిన కాకినాడ, అమలాపురం తుపాను కంట్రోల్ విభాగంలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఆయనేమన్నారంటే..
♦ కోస్తా ప్రాంతంలోని 17 మండలాల్లో 295 గ్రామాలపై తుపాను ప్రభావం చూపే అవకాశం ఉంది.
♦ తుపాను సమయంలో నష్టపోయే 77 రోడ్లు గుర్తించాం. వీటిలో కోస్తాలో 44, సమీప ప్రాంతాల్లో 33 ఉన్నాయి. ఈ రోడ్లపై ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేయడానికి ప్రత్యేక బృందాలను నియమించాం. ఎక్కడైనా చెట్లు నేలకొరిగితే వాటిని తొలగించి రహదారిని క్లియర్ చేసేందుకు వీలుగా జేసీబీలను, కూలీలను సిద్ధం చేశాం. ఇందుకోసం ప్రతి 20 కిలోమీటర్లకు ఒక అధికారుల బృందాన్ని నియమించాం.
♦ తుపాను సహాయక చర్యల కోసం 14 మంది డీఈలు, 33 మంది ఏఈలు, 96 మంది అగ్నిమాపక సిబ్బంది, ఏడు జేసీబీలు, 10 వేల లీటర్ల డీజల్ సిద్ధం చేశాం.
♦ కోస్తా ప్రాంతంలోని 57 మంచినీటి పథకాల వద్ద జనరేటర్లు ఏర్పాటు చేశాం.
♦ 26 విద్యుత్ సబ్ స్టేషన్ల (33/11 కేవీ) వద్ద సిబ్బందిని, జేసీబీలను సిద్ధంగా ఉంచాం.
♦ కాకినాడ – తుని మధ్య అత్యవసర పనుల కోసం 4 వేల విద్యుత్తు స్తంభాలు సిద్ధం చేశాం.
♦ జిల్లాలోని 500 సెల్ టవర్ల పనితీరుకు ఆటంకం లేకుండా అవసరమైన జనరేటర్లు, ఇంధనం, సిబ్బందిని అందుబాటులో ఉంచాం.
♦ 283 సహాయ శిబిరాలు ఏర్పాటు చేశాం. 61 తుపాను షెల్టర్లు సిద్ధం చేశాం. సహాయ శిబిరాల్లో బాధితులకు అందించడానికి 3 వేల దుప్పట్లు, 770 రెయిన్ కోట్లు సమకూర్చాం. సహాయ శిబిరాల వద్ద ఆహార పంపిణీకి 1664 మంది వంట సిబ్బందిని నియమించారు. 61 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు.
♦ సహాయ శిబిరాల కోసం 60 వాహనాలు, రోడ్లపై ఆటంకాలను తొలగించడానికి 200 తుపాను పవర్ బ్లేడులు సిద్ధం చేశాం.
♦ సముద్రంలో వేటకు వెళ్లిన రెండు మత్స్యకార పడవల్లో ఏడుగురితో కూడిన ఒక పడవను సమీపంలోని ఓఎన్‌జీసీ రిగ్ వద్దకు తరలించాం. కొత్తపాలేనికి చెందిన పడవను ఓడలరేవులో గుర్తించాం.
♦ అమలాపురం, కాకినాడల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశాం.
Comments
Please login to add a commentAdd a comment