జడివానలో కాలినడకన గ్రామ పర్యటనకు వెళ్తున్న కలెక్టర్ సుమిత్‌కుమార్, ఎంపీ మాధవి
కొయ్యూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): ఒకవైపు ఉరుములు, పిడుగులతో భారీ వర్షం పడుతున్నా కూడా ఏఎస్‌ఆర్ జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి కొయ్యూరు మండలంలోని కిత్తాబు గ్రామాన్ని సందర్శించారు. మంత్రి, కలెక్టర్ సోమవారం నాడు గానుగుల వరకు ప్రభుత్వ వాహనాల్లో వెళ్లి, అక్కడి నుంచి 2 కిలోమీటర్ల మేర కాలినడకన ప్రయాణించి కిత్తాబు గ్రామానికి చేరుకున్నారు.
జడివానలో తడుచుకుంటూ గ్రామానికి చేరుకున్న మంత్రి, అధికారులను చూసి గిరిజనులు అమితమైన ఆనందానికి లోనయ్యారు. గ్రామంలో తమ సమస్యలను వివరించారు. వారి మాటల్ని ఓపికగా విన్న కలెక్టర్, మంత్రి వెంటనే సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment