ఎన్నికల వ్యయ సెల్‌ను ప్రారంభిస్తున్న కలెక్టర్
సంగారెడ్డి జోన్: పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా జిల్లా కలెక్టరేట్‌లోని డీసీఓ కార్యాలయంలో గురువారం జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఎన్నికల వ్యయ నిర్వహణ సెల్‌ను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జహీరాబాద్ పార్లమెంట్ నియోకవర్గం నుంచి పోటీ చేయనున్న అభ్యర్థులు తమ రోజువారి జమ, ఖర్చులు ఈ సెల్‌లో సమర్పించాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థులు రోజువారి ఖర్చులకు సంబంధించిన అకౌంట్స్ రిజిష్టర్‌లో రికార్డు చేయాలని స్పష్టం చేశారు.
సీజర్స్ అమౌంట్, వస్తువులకు సంబంధించి ఆయా టీంలు ఎక్స్‌పెండిచర్ నోడల్ అధికారికి రిపోర్ట్ అందించాలని సూచించారు. సీజర్స్ మొత్తాలను రుజువులు తీసుకొని నోడల్ అధికారి రిలీజ్ చేస్తారని పేర్కొన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి జిల్లా వ్యయనిర్వహణ నోడల్ అధికారిగా తుమ్మ ప్రసాద్, అసిస్టెంట్ ఎక్స్‌పెండిచర్ అధికారి అంజయ్య ఉన్నారని తెలిపారు.
పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 సెగ్మెంట్‌లకు 7 మంది ఏఈఓలు తమ నివేదికలను నోడల్ అధికారికి సమర్పిస్తారని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఓ ప్రసాద్, పార్లమెంట్ నియోజకవర్గ అసిస్టెంట్ ఎక్స్‌పెండిచర్ అధికారి అంజయ్య, ఏఈఓ చిన్న తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment