శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతున్న కలెక్టర్ హరిత
చెన్నారావుపేట: నాణ్యమైన పంటలు పం డించినపుడే అధిక రాబడి లభిస్తుందని జిల్లా కలెక్టర్ హరిత సూచించారు. ఈ మేరకు మండల కేంద్రంలోని ఆశాజ్యోతి మండల సమాఖ్య కార్యాలయంలో ప్రధానమంత్రి కృషి వికాస్ యోజన పథకం నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ న్యూడిల్లీ వారి ఆధ్వర్యంలో మూడు రోజు ల శిక్షణ తరగతులు మంగళవారం ప్రా రంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు పంటల విషయంలో చేయాల్సినవి, చేయకూడనివి తెలుసుకోని ఉండాలన్నారు.
పండించిన వాటిని విక్రయించే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. మార్కెటింగ్, గ్రేడింగ్, నాణ్యత పాటించినపుడే పండించిన పంటకు అధిక ధర లభిస్తుందని తెలిపారు. మూడురోజుల కాలంలో సందేహాలను నివృత్తి చేసుకొని ఇతర రైతులకు తెలియజేయాలని స్పష్టం చేశారు. నాణ్యమైన పం ట పండించినప్పుడు మార్కెటింగ్ వారు స్వయంగా రైతు వద్దకే వచ్చి ధర ఎక్కువ పెట్టి కొనుగోలు చేస్తారని చెప్పారు. వ్యవసాయ విస్తరణ అధికారులతో భూసార పరీక్షలు చేయించుకొని వాటి ఆధారంగా పంటలు వేసుకోవాలన్నారు.
నర్సంపేటలో మార్చి, పసుపు స్పైసెస్ ఇండస్ట్రీస్..
నర్సంపేటలో పుడ్ ప్రాసెసింగ్‌లో భాగంగా డీఆర్డీఓ సెర్ప్ డిపార్ట్‌మెంట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో మిర్చి, పసుపుతో పాటు వరి, మొక్కజొన్న స్పైసెస్ ఇండస్ట్రీలు ఏర్పాటు చేయడానికి అనుమతులు కోరుతున్నట్లు తెలిపారు. రైతులు నాణ్యమైన పంట పండిస్తే అక్కడనే పండించిన పంటను స్పైసెస్ చేసి అధిక ధరకు విక్రయించవచ్చాన్నారు. స్పైసెస్ బోర్డు జిల్లా డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ లింగప్ప మాట్లాడారు. వరంగల్ వరంగల్ చపట్టా మిర్చికి అధిక డిమాండ్ ఉందన్నారు. 150 దేశాలకు ఎగుమతి చేయడానికి 137 మంది ఎగుమతి దారులు ఉన్నారని అన్నారు. రైతులు పంట పండించిన తర్వాత ప్యాకింగ్, గ్రేడింగ్, మార్కెటింగ్‌లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అలా చేసినప్పుడు సుమారుగా రూ. 8 వేలు ఉన్న మిర్చికి రూ.10 వేల ధర వస్తుందన్నారు.
రైతులు ఈ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోని ఆర్థికంగా ఎదగాలన్నారు.. కార్యక్రమంలో సర్పంచ్ కుండె మల్లయ్య, అసిస్టెంట్ కలెక్టర్ మను చౌదరి, జెడ్పీటీసీ జున్నూతుల రాంరెడ్డి, జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాస్‌రావు, డాట్ సెంటర్ శాస్త్రవేత్త డాక్టర్ విజయ్, డీపీఆర్వో బండి పల్లవి, ఆర్డీఓ రవి, నర్సంపేట ఉద్యానశాఖ అధికారిని జ్యోతి, వ్యవసాయ అధికారి అనిల్, అసిస్టెంట్ మార్కెటింగ్ స్సైసెస్ బోర్డు డైరెక్టర్ స్వప్న థాయర్, వివేక్‌నాథ్, జిల్లా సంక్షేమ అధికారిణి సబిత, తహసీల్దార్ సదానందం, ఎంపీడీఓ చందర్, ఏపీఓ అరుణ, ఎస్సై కూచిపూడి జగదీష్, సాయి స్వచ్ఛంద సంస్థ సీఈఓ వెంకన్న, మండల సమాఖ్య అధ్యక్షురాలు పెంతల స్వప్న, కో ఆర్డినేటర్ సుధాకర్, స్వామి, శిరీష, తదితరులు ఉన్నారు.
వననర్సరీ సందర్శన
మండలంలోని మగ్దుంపురం వన నర్సరిని కలెక్టర్ హరిత సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె రోజుకు ఎన్ని బ్యాగులు నింపుతున్నారు.. ఎన్ని స్టంప్స్ పెడుతున్నారని అడిగి తెలుసుకున్నారు. పనులు ఆలస్యం చేయకుండా వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెండ్యాల జ్యోతి ప్రభాకర్, ఆర్డీవో రవి, ఎంపీడీవో చందర్, ఏపీవో అరుణ, ఎఫ్‌ఏ సతీష్,తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment