Organic farming systems
-
సేంద్రియ పంటలకు అధిక ధర
చెన్నారావుపేట: నాణ్యమైన పంటలు పం డించినపుడే అధిక రాబడి లభిస్తుందని జిల్లా కలెక్టర్ హరిత సూచించారు. ఈ మేరకు మండల కేంద్రంలోని ఆశాజ్యోతి మండల సమాఖ్య కార్యాలయంలో ప్రధానమంత్రి కృషి వికాస్ యోజన పథకం నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ న్యూడిల్లీ వారి ఆధ్వర్యంలో మూడు రోజు ల శిక్షణ తరగతులు మంగళవారం ప్రా రంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు పంటల విషయంలో చేయాల్సినవి, చేయకూడనివి తెలుసుకోని ఉండాలన్నారు. పండించిన వాటిని విక్రయించే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. మార్కెటింగ్, గ్రేడింగ్, నాణ్యత పాటించినపుడే పండించిన పంటకు అధిక ధర లభిస్తుందని తెలిపారు. మూడురోజుల కాలంలో సందేహాలను నివృత్తి చేసుకొని ఇతర రైతులకు తెలియజేయాలని స్పష్టం చేశారు. నాణ్యమైన పం ట పండించినప్పుడు మార్కెటింగ్ వారు స్వయంగా రైతు వద్దకే వచ్చి ధర ఎక్కువ పెట్టి కొనుగోలు చేస్తారని చెప్పారు. వ్యవసాయ విస్తరణ అధికారులతో భూసార పరీక్షలు చేయించుకొని వాటి ఆధారంగా పంటలు వేసుకోవాలన్నారు. నర్సంపేటలో మార్చి, పసుపు స్పైసెస్ ఇండస్ట్రీస్.. నర్సంపేటలో పుడ్ ప్రాసెసింగ్‌లో భాగంగా డీఆర్డీఓ సెర్ప్ డిపార్ట్మెంట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో మిర్చి, పసుపుతో పాటు వరి, మొక్కజొన్న స్పైసెస్ ఇండస్ట్రీలు ఏర్పాటు చేయడానికి అనుమతులు కోరుతున్నట్లు తెలిపారు. రైతులు నాణ్యమైన పంట పండిస్తే అక్కడనే పండించిన పంటను స్పైసెస్ చేసి అధిక ధరకు విక్రయించవచ్చాన్నారు. స్పైసెస్ బోర్డు జిల్లా డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ లింగప్ప మాట్లాడారు. వరంగల్ వరంగల్ చపట్టా మిర్చికి అధిక డిమాండ్ ఉందన్నారు. 150 దేశాలకు ఎగుమతి చేయడానికి 137 మంది ఎగుమతి దారులు ఉన్నారని అన్నారు. రైతులు పంట పండించిన తర్వాత ప్యాకింగ్, గ్రేడింగ్, మార్కెటింగ్‌లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అలా చేసినప్పుడు సుమారుగా రూ. 8 వేలు ఉన్న మిర్చికి రూ.10 వేల ధర వస్తుందన్నారు. రైతులు ఈ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోని ఆర్థికంగా ఎదగాలన్నారు.. కార్యక్రమంలో సర్పంచ్ కుండె మల్లయ్య, అసిస్టెంట్ కలెక్టర్ మను చౌదరి, జెడ్పీటీసీ జున్నూతుల రాంరెడ్డి, జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాస్‌రావు, డాట్ సెంటర్ శాస్త్రవేత్త డాక్టర్ విజయ్, డీపీఆర్వో బండి పల్లవి, ఆర్డీఓ రవి, నర్సంపేట ఉద్యానశాఖ అధికారిని జ్యోతి, వ్యవసాయ అధికారి అనిల్, అసిస్టెంట్ మార్కెటింగ్ స్సైసెస్ బోర్డు డైరెక్టర్ స్వప్న థాయర్, వివేక్నాథ్, జిల్లా సంక్షేమ అధికారిణి సబిత, తహసీల్దార్ సదానందం, ఎంపీడీఓ చందర్, ఏపీఓ అరుణ, ఎస్సై కూచిపూడి జగదీష్, సాయి స్వచ్ఛంద సంస్థ సీఈఓ వెంకన్న, మండల సమాఖ్య అధ్యక్షురాలు పెంతల స్వప్న, కో ఆర్డినేటర్ సుధాకర్, స్వామి, శిరీష, తదితరులు ఉన్నారు. వననర్సరీ సందర్శన మండలంలోని మగ్దుంపురం వన నర్సరిని కలెక్టర్ హరిత సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె రోజుకు ఎన్ని బ్యాగులు నింపుతున్నారు.. ఎన్ని స్టంప్స్ పెడుతున్నారని అడిగి తెలుసుకున్నారు. పనులు ఆలస్యం చేయకుండా వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెండ్యాల జ్యోతి ప్రభాకర్, ఆర్డీవో రవి, ఎంపీడీవో చందర్, ఏపీవో అరుణ, ఎఫ్ఏ సతీష్,తదితరులు ఉన్నారు. -
సేంద్రియ సాగుతోనే రైతు బాగు
మెదక్‌జోన్: అన్ని రకాల పంటలతోనే రైతుకు ఆదాయం సమకూరుతోందని ప్రతిరైతు (ఇంటిగ్రేటెడ్) వ్యవసాయాన్ని అలవర్చుకోవాలని కలెక్టర్ ధర్మారెడ్డి సూచించారు. ఆదివారం హవేళిఘణాపూర్ మండల పరిధిలోని కూచన్‌పల్లి గ్రామంలోని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి, శేరి నారాయణరెడ్డి సాగు చేస్తున్న ఆర్గానిక్ వ్యవసాయ క్షేత్రాన్ని కలెక్టర్, పలువురు జిల్లా స్థాయి అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేంద్రియ ఎరువులతో సాగుచేసిన పంటల దిగుబడి ఎక్కువగా ఉంటుందన్నారు. ఇంటిగ్రేటెడ్ వ్యవసాయంలో భాగంగా నారాయణరెడ్డి, సుభాష్‌రెడ్డిలు ఆర్గానిక్‌తో సాగుచేసిన అరటితోట, జామతోట, చేపల చెరువు, ఆలుగడ్డ సాగు, కోళ్లు, పశువులు, గొర్రెల పెంపకం, మల్బార్చెట్లు , పలురకాల కూరగాయల సాగును డ్రిప్ ద్వార సాగుచేస్తూ తక్కువ నీటితో అధికంగా సాగుచేయటం గర్వించదగ్గ విషయమన్నారు. ఈ సాగువిధానాన్ని ప్రతి రైతు అలవర్చుకోవలని ఆయన సూచించారు. సేంద్రియసాగుతో పండించిన పంటలను తింటే ఆరోగ్యానికి మంచిదని తెలిపారు. డ్రిప్‌తో పంటలను సాగుచేస్తే తక్కువ నీటివినియోగంతో అధిక మొత్తంలో పంటలను సాగుచేయవచ్చన్నారు. ఆయా పంటలను తిలకించిన వ్యవసాయ, హార్టికల్చర్ అధికారులు ఈ విషయాన్ని జిల్లాలోని రైతులకు వివరించి సేంద్రియ వ్యవసాయ పెంపుకోసం కృషి చేయాలని సూచించారు. శేరి సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ ఆలుగడ్డ మన ప్రాంతంలో పండదనే అపోహ రైతులకు ఉండేదని, ప్రస్తుతం తన వ్యవసాయక్షేత్రంలో బంగాళదుంప ను పుష్కలంగా పండుతుందని చెప్పారు. నారాయణరెడ్డి మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయాన్ని చేస్తే మూడు సంవత్సరాల పాటు దిగుబడి కాస్త తక్కువగా వచ్చినా అనంతరం మంచి దిగుబడులు వస్తాయన్నారు. తక్కువనీటితో అధికంగా సాగుచేయటంతో పాటు సేంద్రియ వ్యవసాయంతో పండించిన పంటలు ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతోందని చెప్పారు. ప్రస్తుతం తాము ఇంటిగ్రేటెడ్ వ్యవసాయం చేయటంతో ఎప్పుడూ ఏదోరకమైన పంట చేతికందుతుందని ఫలితంగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయన్నారు. వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించిన వారిలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి పరశురాం, హార్టికల్చరల్ అధికారి నర్సయ్య, వెటర్నరీశాఖ అధికారి అశోక్‌కుమార్‌తో పాటు అధికారులు రెబల్సన్ తదితరులు పాల్గొన్నారు. -
మద్దతు ధర పెంచడమే పరిష్కారం కాదు
సాక్షి, హైదరాబాద్: రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి కేవలం మద్దతు ధరలు పెంచడం ఒక్కటే పరిష్కారం కాదని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. ఆదివారం జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రెండో స్నాతకోత్సవానికి ఆయన అధ్యక్షత వహించి ప్రసంగించారు. నీటి యాజమాన్యం, పంటల మార్పిడి, పంట కోత అనంతర నష్టాలను నివారించేందుకు కోల్డ్ స్టోరేజీ సౌకర్యాలు పెంచడం, సాగు ఖర్చులు తగ్గించడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. వ్యవసాయ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకొని సృజనాత్మక పద్ధతులతో ఆలోచించి రైతులకు వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకు కృషిచేయాలని విద్యార్థులకు సూచించారు. ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా రైతులకు ఆర్థిక భద్రత, ప్రజలకు ఆరోగ్య భద్రత, ఆహార భద్రత కల్పించడమే కాకుండా పర్యావరణానికి హాని కలుగని రీతిలో వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని చెప్పారు. సేంద్రియ సాగు, ఔషధ మొక్కలు పెంచాలి సేంద్రియ వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించి సహజ వనరులను కాపాడాల్సిన అవసరముందని గవర్నర్ సూచించారు. సమర్థ నీటి యాజమాన్యం కోసం జాతీయ నీటి విధానం తీసుకురావాలని.. అందుబాటులోని నీటి వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని చెప్పారు. అలాగే ఔషధ మొక్కల పెంపకంపై దృష్టి పెట్టాలన్నారు. పట్టణాలు, గ్రామాల మధ్య అంతరం తొలగించేందుకు కృషి చేయడం వల్ల వలసలు నివారించవచ్చని తెలిపారు. సమాజ అభివృద్ధి, రైతుల అభ్యున్నతిలో వ్యవసాయ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు చురుకైన పాత్ర పోషించాలన్నారు. రైతులు పండించిన పంటలకు విలువ జోడింపు వల్ల వారికి ఆదాయం పెంచే మార్గాలను కనుగొనాలని సూచించారు. సమాజ అవసరాలకు అనుగుణంగా వర్సిటీ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నందుకు వ్యవసాయ వర్సిటీ వీసీ వి.ప్రవీణ్‌రావును గవర్నర్ అభినందించారు. 27 మందికి బంగారు పతకాలు... 2016–17 విద్యా సంవత్సరానికి పీజీ, పీహెచ్‌డీకి చెందిన 162 మందికి, అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన 584 మంది విద్యార్థులకు స్నాతకోత్సవంలో పట్టాలు అందజేశారు. యూజీ, పీజీ, పీహెచ్‌డీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 27 మందికి బంగారు పతకాలు అందించారు. బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఐరెడ్ల మౌన్యారెడ్డి ఐదు బంగారు పతకాలతో సత్తా చాటింది. బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ విద్యార్థి ఎం.మునిమారుతి రాజు బంగారు పతకాలు అందుకున్నాడు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఎస్.సుధీర్‌కుమార్‌తో పాటు డీన్లు, డైరెక్టర్లు, పాలకమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గౌరవప్రద వృత్తిగావ్యవసాయం గతంతో పోలిస్తే ప్రస్తుతం వ్యవసాయ రంగం గౌరవప్రదమైన వృత్తిగా సమాజంలో గుర్తింపు పొందిందని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత వ్యవసాయ పరిశోధన మండలి మాజీ డైరెక్టర్ రాజేంద్రసింగ్ పరోడాఅన్నారు. ఆయనకు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఆకలి, దారిద్య్రం, అనారోగ్యం లేని సమాజ స్థాపనకు యువ శాస్త్రవేత్తలు కృషి చేయాలన్నారు. వ్యవసాయ విద్య పరిజ్ఞానాన్ని సమాజ అభివృద్ధికి వినియోగించాలన్నారు. అనంతరం వీసీ వి.ప్రవీణ్‌రావు 2016–17 విద్యా సంవత్సరంలో చేపట్టిన కార్యక్రమాల నివేదికను సమర్పించారు. బోధన, పరిశోధన, విస్తరణ రంగాల్లో సంస్కరణలను వివరించారు. -
ప్రకృతికి దగ్గరి నేస్తం ‘అన్నపూర్ణ’!
ప్రకృతికి అనుగుణంగా ఏరువాక.. ప్రతి చినుకునూ ఒడిసిపట్టుకొని రేపటికి దాచే గుణం కలిగినదే ‘అన్నపూర్ణ’ పంటల నమూనా ఆచ్ఛాదన.. సంప్రదాయ విత్తనం.. సేంద్రియ సాగు విధానాలు నీటి ఎద్దడిని తట్టుకోగల అదనపు శక్తినిస్తాయి రుతుపవనాలు ప్రవేశించాయన్న శుభవార్త రైతులల్లో కోటి ఆశలు రేపింది. కానీ, మృగశిరతోపాటే ఆరుద్ర కార్తె కూడా దాటిపోతున్నా.. వరుణ దేవుడు కరుణించకపోయే సరికి.. ఆ ఆనందం అంతలోనే ఆవిరై పోయింది. చల్లటి గాలులు వీచాల్సిన రోజుల్లో వడగాడ్పులు వీస్తుండడం రైతాంగంలో తీవ్ర ఆందోళన కలిగించడం సహజమే. ఇటువంటి వర్షాభావ పరిస్థితులు తలెత్తినప్పుడు కూడా ‘అన్నపూర్ణ’ నమూనా ప్రకృతి వ్యవసాయం ఎంతవరకు తట్టుకొని నిలబడుతుంది? చాలా మంది రైతులు ఈ సందేహాన్నే వ్యక్తం చేస్తున్నారు.. నిజమే.. పదిమందికీ అన్నం పెట్టే రైతన్న పట్ల కన్నెర్రజేసిన ప్రకృతి మాతకు ఎదురొడ్డి సాగు చేయడం అంత తేలిగ్గా సాధ్యమయ్యే పనికాదు. కానీ, ప్రకృతికి అనుగుణంగా ఏరువాక నడిపిస్తే కొంతలోకొంత నిలదొక్కుకోగలుగుతాం. అదెలాగో తెలుసుకుందాం.. ‘సాగుబడి’లో ప్రచురితమవుతున్న ‘అన్నపూర్ణ- అక్షయపాత్ర’ వ్యాస పరంపరలో గతంలో మనం అనేకసార్లు ప్రస్తావించుకున్నట్లు.. అన్నపూర్ణ పంటల నమూనా ప్రకృతికి చాలా దగ్గరి నేస్తం. వానలు కురిపించేది లేదంటూ భీష్మించుకొని కూర్చున్న వాన దేవుడు రాల్చిన చిన్న చిన్న చినుకులను ఒడిసిపట్టుకొని చాలా జాగ్రత్తగా రేపటికి దాచేగుణం ‘అన్నపూర్ణ’ది. ఈ పంటల నమూనాలో అంతర్భాగంగా కందకాలు, తల్లి కాలువలు చేస్తున్న ఉపకారమేంటో మనకు బాగా తెలుసు. దీంతోపాటు.. కురిసిన చినుకులు ఎండకు ఆవిరైపోకుండా కాపాడేది ‘మల్చింగ్’. కరుడుగట్టిన కరువులో సైతం నేలను చీల్చుకుంటూ మొలకై, మొక్కై పంటను అందించే శక్తి మన స్థానిక విత్తనాలకుంది.వర్షాభావ పరిస్థితుల్లో మల్చింగ్‌కి, స్థానిక విత్తనాలకు ఎంతటి ఎంతో ప్రాధాన్యత ఉంది. మల్చింగ్: దీన్నే ‘ఆచ్ఛాదన’ అని కూడా పిల్చుకుంటున్నాం. మన శరీరానికి కప్పిన నూలు వస్త్రం చెమటను పీల్చుకొని తనలో ఇముడ్చుకునే విధంగా.. ఆచ్ఛాదన నేలలో పడిన చినుకులు ఎండకు, గాలికి ఆవిరైపోకుండా తనలోనే ఇముడ్చుకొని మొక్కలకు తేమను అందిస్తుంది. అందుకే అన్నపూర్ణ నమూనాలో మట్టి పరుపునకు మట్టి పరుపునకు మధ్య వేసిన కాలువల్లో పరుపుల మీద నుంచి తీసిన కలుపు మొక్కలు, పంట వ్యర్థాలను వేయడం వలన.. నేలలో తేమ ఎక్కువ రోజులు నిలుస్తుంది. పొలం చుట్టూ, పొలం బయట రాలే ఆకులను మట్టి పరుపు మీద అక్కడక్కడా వేసుకునే పండ్ల మొక్కల పాదుల చుట్టూ ఆచ్ఛాదనగా పేర్చుకోవాలి. ఈ ఆకులు కుళ్లి ఎరువుగా మారి తిరిగి మొక్కకు పోషకాలను అందిస్తాయి. వర్షాలు లేవని కూరగాయల విత్తనాలతో నారు పోసుకో కుండా ఎదురు చూడొద్దు. నారుపోసిన స్థలంలో ఒకటి రెండు అడుగుల ఎత్తులో చిన్న చిన్న కర్రలతో పందిరి వేసుకొని, దాని మీద కొబ్బరి లేదా తాటాకు మట్టలను వేసుకుంటే ఎండవేడిమి తగ్గి.. నారు బాగా పెరుగుతుంది. ఈ లోపు అప్పుడప్పుడూ వర్షాలు పడుతూనే ఉంటాయి. కాబట్టి అదనుచూసి మొక్కలు నాటు వేసుకోవచ్చు. నారు పోసే టప్పుడు గానీ, ఊడ్చేటప్పుడు గానీ బీజామృతంలో శుద్ధి చేసుకోవడం వల్ల కూడా వర్షాభావ పరిస్థితుల నుంచి కొంతకాలం తనను తాను కాపాడుకోగలుగుతుంది. నాటిన మొక్కల చుట్టూ లేదా మట్టి పరుపు అంతటా గడ్డి లేదా ఆకులతో ఆచ్ఛాదన చేసుకుంటే వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతాం. పండ్ల మొక్కల నీడ కూడా ఆచ్ఛాదనే.. వాటి కింద కూడా నారు పోసుకోవచ్చు. వర్షాభావ పరిస్థితులు కొనసాగుతాయనుకున్నప్పుడు తప్పకుండా తక్కువ నీటితో పండే పంటలను వేసుకోవడం శ్రేయస్కరం. మరొక్క ముఖ్య విషయమేమిటంటే.. స్థానికంగా దొరికే సంప్రదాయ విత్తనాలు నీటి ఎద్దడికి, మారుతున్న వాతావ రణ పరిస్థితులకు తట్టుకొని నిలబడగలుగుతాయి. సేంద్రియ సాగు విధానాలు నీటి ఎద్దడిని తట్టుకోగల అదనపు శక్తిని సమకూరుస్తాయి. హైబ్రిడ్ విత్తనాలకంటే ఈ విత్తనాలను నాటుకోవడమే మంచిది. రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడే క్రమంలో నీటి అవసరం కూడా పెరుగు తుంది. కాబట్టి సేంద్రియ సాగు విధానాలను ఆచరించడమే మేలు. అలాగే ప్రతి ఏటా విత్తనాల కోసం అధికారుల చుట్టూ, వ్యాపారస్థుల చుట్టూ తిరిగేకంటే మన విత్తనాలను భద్రపరచుకోవడానికి అలవాటు పడితే రైతు బలపడతాడు.. సుస్థిరంగా నిలబడగలుగుతాడు. - డి. పారినాయుడు (9440164289), అన్నపూర్ణ ప్రకృతి వ్యవసాయ పంటల నమూనా రూపశిల్పి